అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఒక అద్భుతం!
ABN , Publish Date - Jan 21 , 2026 | 10:05 PM
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుతో జరుగుతోన్న మొదటి T20 మ్యాచ్‌లో భారత బ్యాటర్ అభిషేక్ శర్మ రికార్డులు క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్‌పై తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన భారత బ్యాటర్ గా, T20I లలో 25 బంతులు లేదా అంతకంటే తక్కువలో 8 హాఫ్ సెంచరీలు సాధించిన మొదటి బ్యాటర్ అయ్యాడు.
ఆంధ్రజ్యోతి, జనవరి 21: నాగ్‌పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోన్న మొదటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన భారత ఆటగాడు అభిషేక్ శర్మ 84 రన్స్ (35 బంతుల్లో) సాధించాడు. అభిషేక్ ఖాతాలో ఐదు ఫోర్లు, 8 సిక్సర్లు ఉండగా, స్ట్రైక్ రేట్: 240.00 ఒక అద్భుతమనే చెప్పాలి.
22 బంతుల్లో (4 ఫోర్లు, 4 సిక్సర్లతో) అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇది న్యూజిలాండ్‌పై తొలి భారత ఆటగాడు సాధించిన రికార్డు. అంతేకాదు, ఇదే మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు అభిషేక్ శర్మ. T20I లలో 25 బంతులు లేదా అంతకంటే తక్కువలో 8 హాఫ్ సెంచరీలు సాధించిన మొదటి బ్యాటర్ అయ్యాడు.
అంతేకాదు, అభిషేక్ శర్మ ఈ ఇన్నింగ్స్‌తో T20 క్రికెట్‌లో 5000 రన్స్ పూర్తి చేసి (భారత్‌లో నాలుగో ఫాస్టెస్ట్ బ్యాటర్)గా నిలిచాడు. పవర్‌ప్లేలో భారీగా ఆడి ఇండియాను ఆధిపత్యంలోకి తీసుకెళ్లాడు. మిడిల్ ఓవర్లలో కూడా సిక్సర్లు కొట్టి NZ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 11.6 ఓవర్‌లో ఇష్ సోధి బౌలింగ్‌లో లాంగ్ ఆన్లో క్యాచ్ ఇచ్చి భారత స్కోరు 149 ఉండగా ఔట్ అయ్యాడు.
ఇక, అభిషేక్ శర్మ ఈ ఇన్నింగ్స్‌తో ICC T20I ర్యాంకింగ్స్‌లో నెం.1 బ్యాటర్‌గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాడు. ఇది T20 వరల్డ్ కప్ 2026కు ముందు అతనికి భారీ బూస్టప్ అనే చెప్పాలి. సెంచరీ మిస్ అయినా ఇవాళ ఒక అద్భుత ఇన్నింగ్స్ భారత క్రికెట్ అభిమానులకు చూపించాడు అభిషేక్.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..
పోటాపోటీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు..