Share News

ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..

ABN , Publish Date - Jan 21 , 2026 | 12:05 PM

తనపై ఇరాన్ హత్యకు పాల్పడితే.. ఆ దేశాన్ని ఆమెరికా భూస్థాపితం చేస్తుందని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. గతేడాది డిసెంబర్ నుంచి పాలకులకు వ్యతిరేకంగా ఇరాన్‌లో ప్రజలు నిరసనబాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో దాదాపు 5 వేల మంది ప్రాణాలు కోల్పోగా.. 26 వేల మంది అరెస్టైనట్లు సమాచారం.

ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..

వాషింగ్టన్, జనవరి 21: తమ దేశంలో నెలకొన్న పరిస్థితులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారణమని ఇరానియన్లు భావిస్తున్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం ఇరాన్‌లో రాజకీయ పరిస్థితులు మారాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్‌కు మళ్లీ వార్నింగ్ ఇచ్చారు.


తనపై ఇరాన్ హత్యకు పాల్పడితే.. ఆ దేశాన్ని ఆమెరికా భూస్థాపితం చేస్తుందని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. గతేడాది డిసెంబర్ నుంచి పాలకులకు వ్యతిరేకంగా ఇరాన్‌లో ప్రజలు నిరసనబాట పట్టారు. ఈ నిరసనల్లో దాదాపు 5 వేల మంది మృతిచెందగా.. సుమారు 26 వేల మంది అరెస్టైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తమ దేశంలో నెలకొన్న ఈ పరిస్థితులన్నిటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌యే కారణమని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే ఆరోపించారు.


మరోవైపు.. ఇరాన్‌లో నాయకత్వం మారాల్సిన అవసరముందంటూ ఆ దేశంలో నిరసనలకు దిగిన వారికి మద్దతుగా ట్రంప్ వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ నాయకుడే లక్ష్యంగా ఏదైనా దురాక్రమణ జరిగితే.. దానిని తాము దీటుగా ఎదుర్కొంటామంటూ అమెరికాకు ఇరాన్ తీవ్ర స్వరంతో హెచ్చరించింది. అయితే.. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. తనపై ఏదైనా హత్యాయత్నం జరిగి.. దాని వెనక ఇరాన్ హస్తముందని తేలితే.. ఆ దేశాన్ని తుడిచిపెట్టేయాలని తన సలహాదారులను ఆదేశించినట్లు ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు. అవే వ్యాఖ్యలనే ట్రంప్ మరోసారి చేయడం గమనార్హం.


ఈ వార్తలు కూడా చదవండి..

పోటాపోటీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు..

అమ్మకాల హోరు సూచీలు బేజారు..

For More International News And Telugu News

Updated Date - Jan 21 , 2026 | 12:57 PM