పోటాపోటీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు..
ABN , Publish Date - Jan 21 , 2026 | 07:50 AM
అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పుత్తడి, వెండి ధరలు ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఒకదానితో ఒకటి పోటీ పడి పెరుగుతున్నాయి. వీటి ధరలు ఎలా ఉన్నాయంటే..
మాఘమాసం వచ్చేసింది. పెళ్లిళ్ల సీజన్ కాకపోయినా.. పుత్తడి ధరలు ఏ మాత్రం తగ్గలేదు. అంతేకాకుండా బంగారంతోపాటు వెండి ధరలు సైతం పోటీపడుతున్నాయి. ఈ రోజు అంటే.. బుధవారం (21-01-2026) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర భారతదేశంలో రూ.1,54,800 ఉంది. ఇదే ధర నిన్న అంటే.. మంగళవారం రూ 1,49, 780 ఉంది. అంటే నిన్నటికి ఈ రోజుకు ధర పరిశీలిస్తే.. భారీగా పెరిగింది. అది కూడా ఎంత పెరిగిందంటే రూ.5,020. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 41,900కి చేరింది. అదే మంగళవారం రూ. 1, 37, 300 ఉంది. అంటే ఎంత పెరిగిందంటే.. ఒక్క రోజులో రూ. 4,600 పెరిగింది.
ఇక దేశంలో కిలో వెండి ధర బుధవారం రూ.3,25,000 ఉండగా.. ఇదే మంగళవారం 3, 20, 000 ఉంది. అంటే నిన్నటికి ఈ రోజుకు తేడా రూ. 5000 పెరిగింది. ఇక హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54, 800 ఉండగా ఇదే ధర రూ.1,49,780 ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 41,900 ఉండగా.. ఇదే బంగారం నిన్నటి ధర రూ. 1, 37, 300 ఉంది.
ఇక దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ( 24కే, 22కే) ధరలు ఈ విధంగా ఉన్నాయి..
ముంబై: ₹1,54,800; ₹1,41,900;
చెన్నై: ₹1,55,460; ₹1,42,500;
న్యూఢిల్లీ: ₹1,54,950; ₹1,42,050;
కోల్‌కతా: ₹1,54,800; ₹1,41,900;
బెంగళూరు: ₹1,54,800; ₹1,41,900;
విజయవాడ: ₹1,54,800; ₹1,41,900;
కేరళ: ₹1,54,800; ₹1,41,900;
పుణె: ₹1,54,800; ₹1,41,900;
వడోదరా: ₹1,54,850; ₹1,41,950;
అహ్మదాబాద్: ₹1,54,850; ₹1,41,950;
వెండి ధరలు కిలోల్లో..
చెన్నై: ₹3,40,100
ముంబై: ₹3,25,000
న్యూఢిల్లీ: ₹3,25,000
కోల్‌కతా: ₹3,25,000
బెంగళూరు: ₹3,25,000
హైదరాబాద్: ₹3,40,100
విజయవాడ: ₹3,40,100
కేరళ: ₹3,40,100
పుణె: ₹3,25,000
వడోదరా: ₹3,25,000
అహ్మదాబాద్: ₹3,25,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఈ వార్తలు కూడా చదవండి..
మార్కెట్‌ను ముంచిన టారిఫ్ భయాలు
For More Business News And Telugu News