Share News

Trump Tariff Fears Impact Markets: మార్కెట్‌ను ముంచిన టారిఫ్‌ భయాలు

ABN , Publish Date - Jan 20 , 2026 | 06:00 AM

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పెరుగుదల... ప్రత్యేకించి 8 యూరోపియన్‌ దేశాలపై సుంకాలు మరింతగా పెంచుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హెచ్చరిక...

Trump Tariff Fears Impact Markets: మార్కెట్‌ను ముంచిన టారిఫ్‌ భయాలు

325 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పెరుగుదల... ప్రత్యేకించి 8 యూరోపియన్‌ దేశాలపై సుంకాలు మరింతగా పెంచుతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హెచ్చరిక నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్‌ సోమవారం తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో ఈక్విటీ మార్కెట్‌ సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 672.04 పాయింట్ల మేరకు నష్టపోయి 82,898.31 పాయింట్లను తాకినప్పటికీ చివరికి నష్టాన్ని 324.17 పాయింట్లకు పరిమితం చేసుకుని 83,246.18 వద్ద ముగిసింది. నిఫ్టీ 108.85 పాయింట్ల నష్టంతో 25,585.50 వద్ద ముగిసింది. ట్రంప్‌ తాజా హెచ్చరికలకు తోడు నిరాశాపూరితమైన ఫలితాల కారణంగా కార్పొరేట్‌ దిగ్గజాలైన రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎటర్నల్‌ షేర్లలో భారీ అమ్మకాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. సర్వత్రా బలహీనత నేపథ్యంలో బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 1.28ు, మిడ్‌క్యాప్‌ సూచీ 0.43ు నష్టపోయాయి. సెన్సెక్స్‌ షేర్లలో ఆర్‌ఐఎల్‌ గరిష్ఠంగా 3.04ు, ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.26ు నష్టపోయాయి.

బీసీసీఎల్‌ లిస్టింగ్‌ సూపర్‌ హిట్‌

కోల్‌ ఇండియా అనుబంధ సంస్థ భారత్‌ కోకింగ్‌ కోల్‌ (బీసీసీఎల్‌) షేర్ల లిస్టింగ్‌ సూపర్‌ హిట్టయింది. ఇష్యూ ధర కన్నా ఈ షేరు 77ు ప్రీమియంను నమోదు చేసింది. ఇష్యూ ధర రూ.23తో పోల్చితే 96.56ు ప్రీమియంతో బీఎస్‌ఈలో రూ.45.21 వద్ద లిస్టయిన ఈ షేరు రూ.40.66 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈలో కూడా 95.65ు ప్రీమియంతో రూ.45 వద్ద లిస్టయిన ఈ షేరు చివరికి 76.43ు ప్రీమియంతో రూ.40.58 వద్ద ముగిసింది.ఈ ధరలో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.18,935.36 కోట్లుగా నిలిచింది.

ఇవి కూడా చదవండి..

ల్యాండింగ్ సమయంలో ఊడిన విమానం టైరు.. షాకింగ్ వీడియో వైరల్..

మీ ఐక్యూకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న కుక్కను 5 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 20 , 2026 | 06:00 AM