United flight wheel loss: ల్యాండింగ్ సమయంలో ఊడిన విమానం టైరు.. షాకింగ్ వీడియో వైరల్..
ABN , Publish Date - Jan 19 , 2026 | 02:31 PM
అమెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన ఓ విమానానికి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది.
అమెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన ఓ విమానానికి త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం ముందు టైరు ఊడిపడింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది (United Airlines landing incident).
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన ఓ విమానం 206 మంది ప్రయాణికులు, సిబ్బందితో సహా ఆదివారం ఉదయం చికాగో నుంచి ఓర్లాండోకు బయల్దేరింది. ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం కారణంగా విమానం ముందు టైరు ఊడిపడింది. దీంతో విమానం కాస్త బ్యాలెన్స్ తప్పింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది (United flight wheel loss).
ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డారు (airline landing mishap). ఓర్లాండోలోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే ఇలా జరిగి ఉండొచ్చని ఏవియేషన్ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ విమానం రన్‌వేపై నిలిచిపోవడం వల్ల ఇతర విమానాలు ఆలస్యంగా బయల్దేరాయి.
ఇవీ చదవండి:
అర్ధరాత్రి మహిళకు షాకింగ్ అనుభవం! ఛాతిపై ఏదో ఉన్నట్టు అనిపించి చూస్తే..
హనుమాన్ విగ్రహం చుట్టూ శునకం ప్రదక్షిణలు! 36 గంటల పాటు..