Dog Circles Hanuman Idol: హనుమాన్ విగ్రహం చుట్టూ శునకం ప్రదక్షిణలు! 36 గంటల పాటు..
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:42 PM
హనుమాన్ విగ్రహం చుట్టూ ఓ శునకం 36 గంటల పాటు చక్కర్లు కొట్టిన ఘటన తాలూకు వీడియో వైరల్‌గా మారింది. అయితే, కుక్కకు అనారోగ్యం కారణంగా ఇలా జరిగి ఉంటుందని కొందరు అనుమానం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: హనుమంతుడి విగ్రహం చుట్టూ ఓ శునకం ఏకంగా 36 గంటల పాటు ప్రదక్షిణలు చేసిన వింత ఘటన యూపీలోని బిజ్నోర్‌లో వెలుగుచూసింది. శునకం ఎందుకు అలా చేస్తోందో అర్థంకాక స్థానికులు ఆ వింతను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. కొందరు ఫొటోలు, వీడియోలు తీసి నెట్టింట పంచుకున్నారు. ఇదేమైనా దైవికఘటనా? లేక లౌకిక కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటూ నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు (Dog Circling Hanuman Idol in UP).
విగ్రహాలు పాలు తాగడం, లేదా జంతువులు గుళ్లోకి వెళ్లడం వంటి ఘటనలు ఇప్పటికే దేశంలో అనేక మార్లు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో తాజా ఘటన కూడా తెగ వైరల్ అవుతోంది. చాలా మంది ఇదో అద్భుతమంటూ వీడియోపై కామెంట్ చేశారు. లైక్స్, షేర్స్‌తో వీడియోను వైరల్ చేస్తున్నారు.
కొందరు మాత్రం ఈ వీడియోపై సందేహాలు వ్యక్తం చేశారు. శునకానికి ఎదో రోగం ఉండి ఉంటుందని అభిప్రాయపడ్డారు. వ్యాధి కారణంగానే శునకం ఇలా అసాధారణ రీతిలో ప్రవర్తిస్తోందని అన్నారు. అనవసర వదంతులు వ్యాపించ వద్దని సూచించారు. ఖాళీగా ఉండే వాళ్లు ఇలాంటి వీడియోలను, వదంతులను వైరల్ చేస్తుంటారని మరికొందరు విమర్శించారు.
ఇక కొందరేమో తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఏఐ సాయం తీసుకున్నారు. వీడియో వెనకున్న మర్మం ఏంటో విశదీకరించమని ఏఐ చాట్‌బాట్ గ్రోక్‌కు పురమాయించారు. జనాల అనుమానాలను బలపరుస్తూ గ్రోక్ సమాధానం ఇచ్చింది. మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతూ శునకం అలా చేస్తోందని గ్రోక్ పేర్కొంది. ఆ కుక్కకు కాగ్నిటివ్ డిస్‌ఫంక్షన్ డిమెన్షియా వ్యాధి ఉండొచ్చని చెప్పింది. ఇది ఒక రకమైన మతిమరుపు అని వివరించింది. కుక్కలకు ముసలితనంలో ఇలాంటి పరిస్థితి వస్తుంది. తాము ఏం చేస్తున్నదీ? ఏం దిశలో ఉన్నదీ గుర్తించలేని స్థితిలో శునకాలు ఇలా ఒకే పనిని పదే పదే చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆ కుక్క పదే పదే విగ్రహం చుట్టూ చక్కర్లు కొడుతుండవచ్చని గ్రోక్ పేర్కొంది. శునకానికి రేబీస్ వ్యాధి ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేమని చెప్పింది. మరి ఈ వింత వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి!
ఇవీ చదవండి:
కన్నీళ్లు ఆపుకోలేకపోయిన యువకుడు! ట్రాన్స్‌జెండర్ చేసిన పనికి..
విమానంలో ప్రయాణికుడి గాఢ నిద్ర.. సిబ్బంది ఊహించని సర్‌ప్రైజ్