Share News

Viral: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన యువకుడు! ట్రాన్స్‌జెండర్ చేసిన పనికి..

ABN , Publish Date - Jan 12 , 2026 | 10:01 PM

రెండు రోజులుగా భోజనం లేక ఆకలితో అలమటిస్తున్న ఓ యువకుడికి ట్రాన్స్‌జెండర్ తన వద్ద ఉన్న డబ్బులు ఇచ్చిన ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ప్రపంచంలో మానవత్వం ఇంకా మిగిలే ఉందనే నమ్మకాన్ని ఈ ఉదంతం కలిగిస్తోందని జనాలు కామెంట్ చేస్తున్నారు.

Viral: కన్నీళ్లు ఆపుకోలేకపోయిన యువకుడు! ట్రాన్స్‌జెండర్ చేసిన పనికి..
transgender kindness viral video

ఇంటర్నెట్ డెస్క్: లోకంలో మానవత్వం ఇంకా మిగిలే ఉందన్న భరోసా కల్పించే ఓ ఉదంతం ప్రస్తుతం రెడిట్‌లో వైరల్‌గా మారింది. రైల్లో ఓ ట్రాన్స్‌జెండర్ చేసిన పనికి ప్రశంసల వర్షం కురుస్తోంది. బిహార్‌లో ఈ ఘటన జరిగింది(Transgender Helps Young man in Train).

రైళ్లల్లో ట్రాన్స్‌జెండర్‌లు ప్యాసెంజర్‌లను డబ్బులు అడగడం అందరికీ తెలిసిందే. బిహార్‌లో ఇటీవల ఓ రైల్లో కూడా ఇదే జరిగింది. మౌనంగా కూర్చున్న ఓ యువకుడి వద్దకు వచ్చిన ట్రాన్స్‌జెండర్ వ్యక్తి డబ్బులు అడిగింది. అతడి తలపై చేయి వేసి కదిపింది. వెంటనే తలెత్తిన ఆ యువకుడు తన వద్ద డబ్బులు లేవని అన్నాడు. భోజనం చేసి రెండు రోజులైందంటూ కన్నీరు పెట్టుకున్నాడు. అతడి పరిస్థితి చూసి కరిగిపోయిన ట్రాన్స్‌జెండర్ తన పర్సులోంచి డబ్బులు తీసి అతడికి ఇవ్వబోయింది. కానీ యువకుడు మాత్రం మొదట వద్దన్నాడు. కానీ ట్రాన్స్‌జెండర్ మాత్రం అతడి చేతుల్లో బలవంతంగా డబ్బులు పెట్టింది. దీంతో, యువకుడు భావోద్వేగం అణుచుకోలేకపోయాడు. మరింతగా రోదించాడు. ‘దేవుడు నిన్ను చల్లగా చూడాలని ప్రార్థిస్తాను’ అంటూ ట్రాన్స్‌జెండర్ ముందుకు వెళ్లిపోయింది. ఈ దృశ్యం చుట్టుపక్కల వారిని కూడా కదిలించింది.


నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఉదంతంపై జనాలు కూడా పెద్ద ఎత్తున స్పందించారు. ఇలాంటి ఘటనలు చూస్తే లోకంలో ఇంకా మానవత్వం బతికే ఉందన్న నమ్మకం కలుగుతోందని కొందరు అన్నారు. ట్రాన్స్‌‌జెండర్‌ల పట్ల దురభిప్రాయంతో ఉండే వారికి ఈ ఉదంతం ఓ కనువిప్పు అని మరికొందరు కామెంట్ చేశారు. ఇలాంటి మంచి మనసున్న వ్యక్తులను ఇతరులకు సాయపడేందుకు దేవుడు సరైన సందర్భంలో పంపిస్తుంటాడని మరో వ్యక్తి అన్నాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.


ఇవీ చదవండి:

విమానంలో ప్రయాణికుడి గాఢ నిద్ర.. సిబ్బంది ఊహించని సర్‌ప్రైజ్

మొఘలుల వైభవానికి చిహ్నం నెమలి సింహాసనం! దీని చరిత్ర తెలిస్తే..

Updated Date - Jan 12 , 2026 | 10:01 PM