PM Modi Letter: ప్రధాని మోదీకి లేఖ! ఆయన రిప్లై చూశాక..
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:05 PM
ప్రధాన మంత్రి మోదీ నుంచి రిప్లై వస్తుందని ఆశించని ఓ మహిళకు ప్రత్యుత్తరం అందడంతో ఆమె ఆనందానికి అంతేలేకుండా పోయింది. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన ఓ మహిళా టీచర్.. ఆయన రిప్లై ఇస్తారని మాత్రం అనుకోలేదు. కానీ అంచనాలకు భిన్నంగా ప్రధాని నుంచి ప్రత్యుత్తరం రావడంతో ఆమె స్థానికంగా సెలబ్రిటీ అయిపోయారు. యూపీలో వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే (PM Modi's Letter To Teacher Arunashree)..
యూపీకి చెందిన 42 ఏళ్ల అరుణ శ్రీ ఇంటర్ కాలేజీలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. గత నెలలో ఓసారి ఆమె ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయింది. వెంటనే ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌కు కాల్ చేస్తే 15 నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ అయ్యింది. దీంతో, ఆమె ఆశ్చర్యపోయారు. మునుపటి రోజుల్లో కష్టాలు ఆమె కళ్ల ముందు మెదిలాయి.
‘ఆ రోజు మా ఇంట్లో సడెన్‌గా గ్యాస్ సిలిండర్ అయిపోయింది. ఆ సమయంలో నా భర్తకు కూడా ఒంట్లో బాగా లేదు. దీంతో, వెంటనే గ్యాస్ సిలిండర్ ఎలా తెప్పించాలో నాకు అర్థం కాలేదు. చివరి ప్రయత్నంగా స్థానిక ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌కు కాల్ చేశాను. అయితే, ఆశ్చర్యం కలిగించేలా 15 నిమిషాల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిపోయింది. నాకు ఆ సమయంలో భలే సంతోషంగా అనిపించింది. మౌలిక వసతులను ఇంతగా అభివృద్ధి పరిచినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పాలని అనిపించింది. అది నా బాధ్యతగా ఫీలయ్యాను. డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా దేశంలో సామాన్యుల జీవితం ఎంతో సులభతరం అయ్యింది. కొన్నేళ్ల క్రితం పరిస్థితులు ఇలా ఉండేవి కావు. గ్యాస్ సిలిండర్ కోసం మేము మహిళల కోసం ఉద్దేశించిన ప్రత్యేక క్యూ లైన్‌లల్లో నిలబడాల్సి వచ్చేది. సాధారణ క్యూలు చాలా పెద్దగా ఉండటంతో ఇంట్లో వాళ్లు నన్ను పంపించేవారు’
‘కానీ ఈ రోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అన్ని పనులూ చిటికెలో అయిపోతున్నాయి. సేవలన్నీ డిజిటల్‌గా మార్చిన క్రెడిట్ ప్రధాని మోదీదే’ అని ఆమె అన్నారు. ఇవన్నీ చెబుతూ ప్రధానికి లేఖ రాసినట్టు తెలిపారు. రోజూ ప్రధాన మంత్రి కార్యాలయానికి లక్షల సంఖ్యలో లేఖలు వస్తాయి కాబట్టి తన లేఖ మరుగున పడిపోతుందని అనుకున్నట్టు కూడా చెప్పారు. కానీ బుధవారం తనకు ప్రధాని నుంచి లెటర్ అందడంతో ఆశ్చర్యానందాలు కలిగాయని అన్నారు. ‘ప్రధాని మోదీ నా లేఖను చదివి రిప్లై కూడా ఇచ్చారని తెలిశాక ఆనందం మిన్నంటింది’ అంటూ మహిళ తెగ సంబరపడ్డారు.
ఇవీ చదవండి:
గులాబీ రంగులో ఆకాశం.. ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసుండరు!
మహీంద్రా కారు కింద ఇటుకలు పెట్టి.. టైర్ల చోరీ