Home » Trending
తమ సంస్థలో ఉద్యోగం కోరే వారికి డిగ్రీ పట్టాలు ఉండాల్సిన అవసరం లేదంటూ జోహో అధిపతి శ్రీధర్ వెంబు చేసిన ప్రకటన ప్రస్తుతం సంచలనంగా మారింది. దీంతో, టాలెంట్ ఉన్న యువత అందరికీ అవకాశాలు మెరుగవుతాయని జనాలు కామెంట్ చేస్తున్నారు.
బిహార్లో వధూవరుల కుటుంబాల మధ్య తలెత్తిన వివాదం చివరకు పెళ్లే క్యాన్సిల్ అయ్యేలా చేసింది. విందులో రసగుల్లాలు తక్కువైనందుకు ఇరు వర్గాలు ఇష్టారీతిన పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
భారత్లో పర్యటించే విదేశీయులు నిత్యం స్లమ్ ఏరియాలు మాత్రమే చూడాలని ఎందుకు అనుకుంటారంటూ ఓ ఆస్ట్రేలియా వ్లాగర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ అంశాన్ని హైలైట్ చేసేందుకు ప్రయత్నించిన అతడిపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.
జాబ్కు అప్లై చేసుకున్న నిమిషాల్లో తిరస్కరణకు గురయిన ఓ అభ్యర్థి తన అనుభవాన్ని నెట్టింట పంచుకున్నాడు. రిక్రూటర్ తీరుపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది.
ఆమ్స్టర్డ్యామ్ నగర వీధుల్లో చెత్తాచెదారం ఉన్నా జనాలు మాత్రం కేవలం భారతీయులకే పౌర స్పృహ లేనట్టు మాట్లాడుతుంటారంటూ ఓ వ్యక్తి నెట్టింట షేర్ చేసిన వీడియో వైరల్గా మారింది. దీనిపై జనాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతర దేశాలతో పోలిక ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
విమానంలో చాపపై పడుకుని జర్నీని ఎంజాయ్ చేసిన ఓ యువకుడి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇందుకోసం తాను ఫాలో అయిన ట్రిక్ ఏమిటో కూడా సదరు యువకుడు తెలిపాడు. దీంతో, నెట్టింట ఈ వీడియోకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
యూపీలో ఓ యువకుడు తన అభ్యుదయ భావాలను చాటుకున్నాడు. పెళ్లి వేదికపై రూ.31లక్షల కట్నాన్ని వద్దని తిరస్కరించాడు. దీంతో, అతడిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.
కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకుని ఆటో డ్రైవర్గా మారిన ఓ వ్యక్తి చెప్పిన జీవితపాఠం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోకు జనాలు జై కొడుతున్నారు.
30 ఏళ్ల కాలవ్యవధిపై గృహ రుణం తీసుకున్న తన స్నేహితుడు ఎలాంటి కష్టాలు పడుతున్నాడో చెబుతూ ఓ వ్యక్తి నెట్టింట పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. అతడి అభిప్రాయంతో అనేక మంది ఏకీభవించారు.
జీవితాంతం కష్టపడి సంపాదించిన రూ.1.2 కోట్లు మొత్తాన్ని ఎఫ్డీల్లో పెట్టిన ఓ పెద్దాయన చాలా తప్పు చేశారని ఓ సీఏ నెట్టింట పోస్టు పెట్టారు. ఇది ఎంత ప్రమాదమో వివరించాక ఆయన పెట్టుబడుల పోర్టుఫోలియోను భవిష్యత్తు అవసరాలకు అనుగూణంగా మార్చినట్టు తెలిపార. ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.