శభాష్.. బామ్మా! వృద్ధురాలికి పోలీసుల సన్మానం! ఎందుకో తెలిస్తే..
ABN , Publish Date - Feb 15 , 2026 | 10:48 AM
ఫుట్‌పాత్‌పై వాహనం తోలేందుకు ప్రయత్నించిన వాహనదారుడికి బుద్ధి వచ్చేలా చేసిన ఓ వృద్ధురాలిని కేరళ పోలీసులు తాజాగా సన్మానించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫుట్‌పాత్‌పై స్కూటీని తోలేందుకు ప్రయత్నించిన వాహనదారుడికి బుద్ధి చెప్పిన ఓ వృద్ధురాలిని కేరళ పోలీసులు (Kerala Police) తాజాగా సన్మానించారు. తప్పు చేస్తున్న వ్యక్తిని నిర్భయంగా నిలదీసినందుకు ఆమెను అభినందించారు (Kerala elderly woman viral video).
ఇటీవల కేరళలో ప్రభావతి అనే వృద్ధురాలి వీడియో వైరల్‌గా మారింది. కొళికోడ్‌లో ఓ వాహనదారుడు ట్రాఫిక్ రద్దీని తప్పించుకునేందుకు ఫుట్‌పాత్‌పై నుంచి తన స్కూటీని తోలేందుకు ప్రయత్నించాడు. అతడికి ఎదురుగా వచ్చిన ప్రభావతి వాహనదారుడిని అడ్డుకున్నారు. తప్పు ఎందుకు చేస్తున్నావని అతడిని నిలదీశారు. అతడు తనను తప్పించుకుని ముందుకెళ్లకుండా అడ్డుగా నిలబడ్డారు. అతడి వాహనాన్ని ఫొటో తీశారు. వృద్ధురాలి దెబ్బకు వాహనదారుడు వెనక్కు తగ్గాడు. ఫుట్‌పాత్ నుంచి కిందకు దిగిపోయాడు (Kerala footpath driving viral video).
ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జనాలు వృద్ధురాలిని ప్రశంసల్లో ముంచెత్తారు. వాహనదారుడితో ప్రశాంతంగా వ్యవహరిస్తూనే వృద్ధురాలు అతడికి బుద్ధి వచ్చేలా చేసిన తీరు జనాలను అమితంగా ఆకట్టుకుంటంది. ఈ వీడియోపై పోలీసుల దృష్టి పడటంతో వారు ప్రభావతిని సన్మానించారు. తప్పు జరుగుతున్న వైనాన్ని ఎత్తి చూపి బాధ్యతతో నడుచుకున్నందుకు ప్రశంసించారు. రోడ్లపై వాహనదారులు బాధ్యతతో నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభావతి స్ఫూర్తితో జనాలు బహిరంగ ప్రదేశాల్లో మరింత బాధ్యతగా నడుచుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ఇవీ చదవండి:
కాలుతున్న చితి.. ఆ భస్మాన్ని ఒంటికి రాసుకున్నా: బాలీవుడ్ నటుడు
యూట్యూబ్ ఛానల్ కోసం ఆస్తులమ్మి.. వ్యూస్ రాలేదనే కోపంలో.