Share News

సంతానం లేని వారిపై ఎలాన్ మస్క్ సంచలన కామెంట్స్

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:28 PM

సంతానం లేని వారికి మానవాళి భవిష్యత్తుతో ఎలాంటి సంబంధం లేదంటూ ఎలాన్ మస్క్ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ప్రముఖ ఫిలాసఫర్ అమాండాను ఆంథ్రొపిక్ తమ ఏఐ మోడల్స్ అభివృద్ధి కోసం నియమించుకున్న నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.

సంతానం లేని వారిపై ఎలాన్ మస్క్ సంచలన కామెంట్స్
Elon Musk

ఇంటర్నెట్ డెస్క్: టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా నెట్టింట పంచుకుంటూ ఉంటారు. ఇవి ఒక్కోసారి కలకలానికి దారి తీస్తుంటాయి. సంతానం లేని వారిపై మస్క్ తాజాగా చేసిన కామెంట్స్ కూడా ప్రస్తుతం వివాదానికి దారి తీశాయి.

ఏఐ సంస్థ ఆంత్రొపిక్ ఇటీవల ప్రముఖ ఫిలాసఫర్ అమాండా ఆస్కెల్‌ను నియమించుకుంది. ఏఐ మోడల్స్‌కు నైతిక ప్రమాణాలను నిర్దేశించడం ఆమె బాధ్యత. అయితే, అమాండాకు సంతానం లేకపోవడంపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లలు లేని వారికి మానవాళి భవిష్యత్తుతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ కామెంట్స్ ఒక్కసారిగా కలకలానికి దారి తీశాయి.


అయితే, మస్క్ కామెంట్స్‌పై అమాండా కూడా స్పందించారు. తాను పిల్లల్ని కనొద్దని అనుకున్న మాట వాస్తవమేనని అన్నారు. అయితే, మానవాళి భవిష్యత్తు తనకు ఎంతో కీలకమని అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలన్నదే తన అభిమతమని మస్క్‌కు గట్టిగా బదులిచ్చారు.

పాశ్చాత్య దేశాల్లో పునరుత్పత్తి రేటు పడిపోతుండంపై మస్క్ ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తీరు ఇలాగే కొనసాగితే చివరకు మానవ నాగరికతే అంతరించిపోతుందని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. సంతానం అనేది కేవలం వ్యక్తిగత విషయం కాదని, అది సామాజిక ప్రాధాన్యం ఉన్న అంశమని చెప్పుకొచ్చారు.


ఈ వార్తలూ చదవండి:

వరుడిని చూడగానే ట్రాన్స్‌జెండర్‌లకు డౌట్! ఆ తరువాత..

ఫోన్‌లో మాట్లాడుతున్న మహిళ! ఇంతలో ఊహించని విధంగా..

Updated Date - Feb 17 , 2026 | 11:32 PM