వరుడిని చూడగానే ట్రాన్స్‌జెండర్‌లకు డౌట్! ఆ తరువాత..
ABN , Publish Date - Feb 17 , 2026 | 10:36 PM
వరుడు ట్రాన్స్‌జెండర్ అన్న వార్త విన్న వధువు కుటుంబం పెళ్లిని రద్దు చేసుకున్న ఘటన యూపీలో తాజాగా వెలుగు చూసింది. ట్రాన్స్‌జెండర్‌ల ఎంట్రీతో పెళ్లి చివరి నిమిషంలో రద్దైపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: ట్రాన్స్‌జెండర్‌ల ఎంట్రీతో ఓ పెళ్లి తంతు అనూహ్య మలుపు తిరిగింది. బారాబంకీ జిల్లాలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కోఠీ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం పెళ్లి కొడుకు తరపు వారు ఊరేగింపుగా వధువు ఇంటికి వెళ్లారు. ఆ రాత్రి రకరకాల కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగిపోయాయి.
శనివారం నాడు పరిస్థితి ఊహించని మలుపు తిరిగింది. వాస్తవానికి ఆ రోజు కూడా పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చివరి వరకూ సాఫీగా సాగిపోయాయి. సప్తపది కార్యక్రమం కూడా జరిగింది. అప్పగింతల తరువాత పెళ్లి కూతురు అత్తవారింటికి వెళ్లాల్సి ఉంది. ఇంతలో అక్కడికి కొందరు ట్రాన్స్‌జెండర్‌లు వచ్చారు. పెళ్లి వారి నుంచి డబ్బులు తీసుకున్నారు. అయితే, నూతన దంపతులను దీవించే క్రమంలో వరుడిని చూడగానే వారికి డౌట్ వచ్చింది. ఆ తరువాత క్షణాల్లో పరిస్థితి మారిపోయింది.
వరుడు కూడా ట్రాన్స్‌జెండర్ అన్న విషయం వధువు కుటుంబానికి తెలిసి షాకైపోయారు. వరుడి కుటుంబాన్ని నిలదీశారు. ఆ తరువాత ఒక్కసారిగా ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం పతాకస్థాయికి చేరుకుంది. అప్పటికే వరుడి తరపు బంధువులు కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిజం చెప్పాలని వరుడినీ నిలదీశారు. కానీ అతడు అలాంటిదేమీ లేదని తేల్చి చెప్పాడు. కానీ వధువు కుటుంబానికి సందేహాలు పూర్తిగా తొలగిపోలేదు. ఈలోపుపోలీసులూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
విషయాన్ని పెద్దది చేయొద్దని వరుడి కుటుంబం వధువు కుటుంబాన్ని అభ్యర్థించింది. తమ పరువు కాపాడాలని కోరింది. వారికి రూ.23 వేలను కూడా ఇచ్చింది. చివరకు వధువు కుటుంబం శాంతించింది. పెళ్లిని రద్దు చేసుకుని వారు వెళ్లిపోయారు.
ఈ వార్తలూ చదవండి:
భారతీయులతో కలిసి ఉంటే ఇంతే.. పాకిస్థానీ వీడియో వైరల్
ఎయిర్‌హోస్టస్‌కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ప్రయాణికుడు