Share News

భారతీయులతో కలిసి ఉంటే ఇంతే.. పాకిస్థానీ వీడియో వైరల్

ABN , Publish Date - Feb 17 , 2026 | 07:58 PM

బ్రిటన్‌లో ఒకే అద్దె ఇంట్లో ఉంటున్న భారతీయ, పాకిస్థానీ యువకులు ఒకరినొకరు ఆటపట్టించుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. భారత్‌ చేతిలో పాక్ ఓటమి నేపథ్యంలో చేసిన ఈ వీడియో జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

భారతీయులతో కలిసి ఉంటే ఇంతే.. పాకిస్థానీ వీడియో వైరల్
Pakistani student viral video UK

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులతో కలిసి ఒకే ఇంట్లో ఉంటే ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ ఓ పాకిస్థానీ నెట్టింట పంచుకున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. యూకేలో భారతీయుడితో కలిసి ఉంటున్న ఓ పాకిస్థానీ యువకుడు ఈ వీడియోను షేర్ చేశాడు. ఇటీవల భారత్‌ చేతిలో పాక్ ఓటమి నేపథ్యంలో అతడు సరదాగా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

పాకిస్థాన్‌కు చెందిన అలీ రజా యూకేలో ట్రెయినీ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్‌గా చేస్తున్నాడు. యూసుఫ్ సులేమాన్ అనే భారతీయ సింగర్‌తో కలిసి ఒకే అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన టీ20 మ్యాచ్‌లో పాక్ భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ముఖ్యంగా పాకిస్థానీ బ్యాట్స్‌మన్ ఫర్హాన్ డక్‌ఔట్‌గా వెనుదిరిగాడు.


ఈ నేపథ్యంలో యూసుఫ్ సులేమానీ అలీ రజాను సరదాగా ఆటపట్టించాడు. అలీ రజా వంటగదిలో రొట్టెలు చేస్తుండగా యూసుఫ్ వచ్చి ఫర్హాన్ డకౌట్ గురించి గుర్తుచేశాడు. ‘యువరాజు ఫర్హాన్’ అంటూ అలీ రజాను ఆటపట్టించాడు. దీంతో, అలీ రజా కూడా అదే రేంజ్‌లో స్పందించాడు. ‘వెళ్లి నీ పని చేసుకోవయ్యా.. అంటూ కామెంట్ చేశాడు. భారతీయులతో కలిసి ఒకే అద్దె ఇంట్లో ఉంటే ఇలాంటి ఇబ్బందులే పడాల్సి వస్తుందంటూ సరదాగా ఈ వీడియోను షేర్ చేశారు.

ఇక ఈ వీడియోకు జనాల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ముఖ్యంగా భారతీయుడు, పాకిస్థానీ రూమ్‌‌మేట్స్‌గా ఉండటం అనేక మందిని ఆకర్షించింది. బ్రిటన్‌లో ఖర్చులను భరించాలంటే శత్రువులు కూడా ఇలా ఒకే గూటిలో తలదాచుకోవాల్సి వస్తుందని కొందరు కామెంట్ చేశారు. వారి మధ్య స్నేహం, ఒకరినొకరు ఆటపట్టించుకోవడం కూడా జనాలను ఆకట్టుకున్నాయి. మరి ఇంతలా వైరల్‌గా మారిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!


ఈ వార్తలూ చదవండి:

ఈమె తల్లేనా.. కన్న బిడ్డను నడిరోడ్డుపై దారుణంగా..

ఓం నమః శివాయః.. కొరియన్ సింగర్ పోస్టు వైరల్

Updated Date - Feb 17 , 2026 | 07:59 PM