Share News

ఓం నమః శివాయః.. కొరియన్ సింగర్ పోస్టు వైరల్

ABN , Publish Date - Feb 16 , 2026 | 05:43 PM

కే పాప్ సింగర్ అవూరా నిన్న మహాశివరాత్రిని పురస్కరించుకుని శివ నామ స్మరణలో తరించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తనకు శివుడే మార్గదర్శి అంటూ అతడు ఈ పోస్టును షేర్ చేశాడు.

ఓం నమః శివాయః.. కొరియన్ సింగర్ పోస్టు వైరల్
Oora K Pop Singer Om Namah Sivayah Viral Video

ఇంటర్నెట్ డెస్క్: మహాశివరాత్రి నాడు యావత్ దేశం భోళా శంకరుడి నామస్మరణతో తరించింది. భారతీయులతో పాటు భారతీయ ఆధ్యాత్మికత గొప్పదనం తెలిసిన విదేశీయులు కూడా నిన్న రాత్రి పరమ శివుడి నామస్మరణతో జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కే-పాప్ సింగర్ అవూరా కూడా ఓం నమః శివాయః అంటూ భక్తి పారవశ్యంలో ఓలలాడాడు. అతడు పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (K-Pop Singer Aoora).

అవూరాకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అంటే ఎంతో ఇష్టం. నిత్యం భారతీయ ఆర్టిస్టులతో కలిసి పాటలు రూపొందిస్తుంటాడు. నిన్న శివరాత్రి నాడు చెన్నైలోని ఓ శివాలయంలో పరమశివుడుని అర్చిస్తూ మైమరిచిపోయాడు. ‘నిన్న చెన్నైలో నాకు ఆ భగవంతుడి దీవెనలు లభించాయి. మర్చిపోలేని అనుభవం ఇది. ఎందరో భక్తుల సమక్షంలో శివనామస్మరణతో తరించాను. నేను భారత్‌లో పుట్టకపోయినా ఇక్కడి సంస్కృతితో నాకు భావోద్వేగపూరిత బంధం ఉంది. మహా శివరాత్రి నాడు నాకు స్వామి వారి సేవ చేసుకునే అవకాశం లభించడంతో మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. నాకు ఆ మహాశివుడే మార్గదర్శిగా నిలిచాడు. ఓం నమః శివాయః’ అని క్యాప్షన్‌తో వీడియో షేర్ చేశాడు. సంప్రదాయ భారతీయ దుస్తుల్లో తను భజన చేస్తున్నవీడియోను షేర్ చేశాడు.


ఇక శివరాత్రికి కొద్ది రోజుల ముందు అవూరా ‘శివ శివమ్’ అనే పాటను రిలీజ్ చేశాడు. భారత్‌కు వచ్చి నాటికి మూడేళ్లు పూర్తయ్యిందని చెప్పుకొచ్చాడు. ఇక్కడి ప్రజలు తనను నిండుమనసుతో ఆదరించారని తెలిపాడు. ఇందుకు తాను దేవుడికి, భారతీయులకు సదా రుణపడి ఉంటానని కూడా కామెంట్ చేశారు.


ఈ వార్తలూ చదవండి:

శభాష్.. బామ్మా! వృద్ధురాలికి పోలీసుల సన్మానం! ఎందుకో తెలిస్తే..

కాలుతున్న చితి.. ఆ భస్మాన్ని ఒంటికి రాసుకున్నా: బాలీవుడ్ నటుడు

Updated Date - Feb 16 , 2026 | 05:53 PM