ఈమె తల్లేనా.. కన్న బిడ్డను నడిరోడ్డుపై దారుణంగా..
ABN , Publish Date - Feb 17 , 2026 | 03:06 PM
కన్న బిడ్డ అని కూడా చూడకుండా చిన్నారిని ఇష్టారీతిన కొట్టిన ఓ మహిళ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. బిహార్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: కన్న తల్లే సైకోలా మారి చిన్నారిని పాశవికంగా హింసించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది. బిహార్‌లోని ముజఫర్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది (Bihar Shocker Viral Video).
ఈ వీడియోను నెట్టింట షేర్ చేసిన వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మహిళ సైకోలా మారి తన కూతురినే ఇష్టారీతిన కొట్టిందని మండిపడ్డారు. స్కూలు బ్యాగులో ఇటుకలు పెట్టి చిన్నారితో మోయించడమే కాకుండా ఆమెను నలుగురిలో నిలబెట్టి చెంప ఛెళ్లుమనిపించిందని చెప్పారు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, నలుగురూ చూస్తున్నారన్న సోయ కూడా లేకుండా చిన్నారిని ఆమె తల్లి కొట్టింది. కాలితో తన్నింది. చుట్టుపక్కల వారు రికార్డు చేస్తున్నా లెక్క చేయక చిన్నారిపై సైకోలా రెచ్చిపోయింది. తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారినీ ఆమె లెక్కచేయలేదు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ రెచ్చిపోయింది. ఇక ఈ వీడియోపై స్పందించిన బిహార్ పోలీసులు ముజఫర్‌నగర్ జిల్లా పోలీసులను ట్యాగ్ చేశారు.
వీడియో వైరల్ కావడంతో నెట్టింట సహజంగానే విమర్శలు వెల్లువెత్తాయి. చిన్నారిని ఇంతలా హింసించిన మహిళకు కఠిన శిక్ష విధించాలని జనాలు డిమాండ్ చేశారు. ఇలాంటి పనుల ద్వారా చిన్నపిల్లలను క్రమశిక్షణలో పెట్టలేరని మరికొందరు తేల్చి చెప్పారు.
ఈ వార్తలూ చదవండి:
ఓం నమః శివాయః.. కొరియన్ సింగర్ పోస్టు వైరల్
శభాష్.. బామ్మా! వృద్ధురాలికి పోలీసుల సన్మానం! ఎందుకో తెలిస్తే..