ఫోన్‌లో మాట్లాడుతున్న మహిళ! ఇంతలో ఊహించని విధంగా..
ABN , Publish Date - Feb 17 , 2026 | 09:44 PM
ఓ మహిళపై వీధి కుక్క అకస్మా్త్తుగా దాడి చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది. వీధి కుక్కల సంఖ్యను నియంత్రించకపోతే ఇలాంటి ప్రమాదాలు తప్పవని నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వీధి కుక్కలు జనాలపై దాడులు చేస్తున్న ఘటనలు నిత్యం దేశంలో వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఫోన్‌లో మాట్లాడుతున్న ఓ మహిళపై వీధి కుక్క అకస్మాత్తుగా దాడి చేసిన వైనం జనాలను కలవరపెడుతోంది.
ఘటన ఎక్కడ జరిగిందో తెలియకపోయినప్పటికీ జనాలను ఈ వీడియో భయాందోళనకు గురి చేస్తోంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ మహిళ తన ఇంటి ముందు ఫోన్‌లో మాట్లాడుతూ పచార్లు చేస్తుండగా ఓ వీధి కుక్క అకస్మాత్తుగా దాడి చేసింది. ఆమెను కరిచి వదిలిపెట్టకపోవడంతో మహిళ విలవిల్లాడింది. పెద్దపెట్టున అరిచింది. దాన్నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పరిగెత్తబోయి కింద పడింది. ఈ లోపు చుట్టుపక్కల వారు వచ్చి కుక్కను తరిమేయడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. వీధి శునకాల సంఖ్యను కట్టడి చేయకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని హెచ్చరించారు. ఇది భావోద్వేగాలకు సంబంధించిన అంశం కాదని, ప్రజల భద్రత దృష్ట్యా వాస్తవ దృక్కోణంతో స్పందించాలని సూచించారు.
కొందరు మాత్రం వీడియోపై తమ అనుమానాలను వ్యక్తం చేశారు. అసలేం జరిగిందో వీడియో ద్వారా పూర్తిగా తెలియలేదని అన్నారు. ఎవరూ రెచ్చగొట్టకుండా కుక్కలు దాడి చేయవని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఈ వార్తలూ చదవండి:
భారతీయులతో కలిసి ఉంటే ఇంతే.. పాకిస్థానీ వీడియో వైరల్
ఎయిర్‌హోస్టస్‌కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ప్రయాణికుడు