Mahindra Car Tyre Theft: మహీంద్రా కారు కింద ఇటుకలు పెట్టి.. టైర్ల చోరీ
ABN , Publish Date - Jan 10 , 2026 | 08:11 PM
మహీంద్రా కారును ఇటుకలపై నిలబెట్టి టైర్లను చోరీ చేసిన ఘటన గ్రేటర్ నోయిడాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: గ్రేటర్ నోయిడాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మహీంద్రా థార్ కారు చక్రాలను దొంగలు చోరీ చేశారు. కారు కింద ఇటుకలను పేర్చి టైర్‌లను ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది (Mahindra Car Tyre Theft).
గ్రేటర్ నోయిడాలోని ఒమైక్రాన్-2 రెసిడెన్షియల్ సెక్టార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చక్రాలు లేని కారు వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. డ్రైవర్ వైపు ఉన్న రెండు టైర్‌లను నిందితులు దొంగిలించారు. కారు కింద ఇటుకలను పేర్చి ఆపై జాగ్రత్తగా టైర్లను ఎత్తుకెళ్లినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. ముందుగా కారు అద్దాలను పగలగొట్టి అలారమ్‌ను ఆఫ్ చేశాక చోరీ చేసి ఉంటారని చెబుతున్నారు.
ఈ విషయమై ఇంకా పోలీసులు స్పందించలేదు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదైందా? లేదా? అన్నది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పక్కన పార్క్ చేసే తమ కార్ల పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక నెట్టింట కూడా ఈ ఉదంతం వైరల్‌గా మారింది. దొంగలు మితిమీరి పోతున్నారంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, భారీ ఎస్‌యూవీ కార్ల అలాయ్ టైర్లను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. ఈ టైర్‌లకు మార్కెట్‌లో డిమాండ్ ఉండటంతో చోరీలకు తెగబడుతున్నారు. కారు మొత్తాన్ని దొంగిలించడం కంటే టైర్‌ల చోరీ సులభమని భావించి ఇలాంటి చోరీలకు తెగబడుతున్నట్టు సమాచారం.
ఇవీ చదవండి:
యూకేలో ఎన్నారై యువతికి షాక్! పరాఠాలపై మనసు పోవడంతో..
సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్.. అద్దె రూ.8 లక్షలైనా ఒకే అంటున్న మహిళ