Share News

London 1BHK Rent: సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్.. అద్దె రూ.8 లక్షలైనా ఒకే అంటున్న మహిళ

ABN , Publish Date - Jan 09 , 2026 | 10:49 PM

లండన్‌లో తాను ఉంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటి అద్దె నెలకు రూ.8 లక్షలు అంటూ ఓ మహిళ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. స్థానిక భారత సంతతి వ్యక్తులు అనేక మంది ఈ వీడియోపై పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు.

London 1BHK Rent: సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్..  అద్దె రూ.8 లక్షలైనా ఒకే అంటున్న మహిళ
London flat rent viral video

ఇంటర్నెట్ డెస్క్: లండన్‌లో భారతీయ మహిళ తన ఇంటి అద్దె నెలకు రూ.8 లక్షలు అంటూ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈస్ట్-సెంట్రల్‌ లండన్‌లోని ఈ ఫ్లాట్ సింగిల్ బెడ్ రూమ్ మాత్రమే అని ఆమె చెప్పడంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది (1 BHK Flat in London Rent Rs 8 Lakh).

దీపాన్షీ చౌదరి అనే మహిళ ఈ వీడియోను షేర్ చేసింది. తన ఫ్లాట్‌లో అన్ని సౌకర్యాలూ ఉన్నాయని చెప్పింది. ఫ్లాట్ లోపలికి వెళ్లగానే ఒక చిన్న లాబీ, ఆ పక్కనే వాష్‌రూమ్, సామాన్లు పెట్టుకునేందుకు మరో చిన్న గది, క్వీన్ సైజ్ బెడ్ ఉన్న పడకగది, సోఫా ఉన్న లివింగ్ రూమ్, డైనింగ్ టేబుల్, టీవీ, కిచెన్.. ఇలా అన్నిటినీ తన వీడియోలో చూపించింది. స్వల్ప కాలానికి అద్దెకు తీసుకున్నందుకు అద్దె కాస్త ఎక్కువగానే ఉందని పేర్కొంది. అయితే, ఫ్లాట్ కిటికీ నుంచి బయటకు చూస్తే అద్భుతమైన సెయింట్ క్యాథెడ్రల్ కనిపిస్తుందని చెప్పింది. ఇంత చక్కని వ్యూ ఉన్నందుకైనా ఇంత అద్దె చెల్లించడంలో తప్పు లేదని కామెంట్ చేసింది.


అయితే, ఈ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది చాలా ఎక్కువని అనేక మంది అభిప్రాయపడ్డారు. హాంప్‌స్టెడ్ వంటి ప్రాంతాల్లో రెండు అంతస్తుల ఇల్లు నెలకు మూడు వేల పౌండ్స్ (రూ.3.63 లక్షలు) అని చెప్పారు. అక్కడికి సుమారు 15 నిమిషాల దూరంలో ఉన్న తాము త్రీబెడ్‌రూమ్ ఇంటికి నెలకు 3 వేల పౌండ్ల అద్దె చెల్లిస్తున్నామని మరో వ్యక్తి అన్నారు. పర్యటనల కోసం వచ్చే వారికి లండన్ అనుకూలమే గానీ దీర్ఘకాలిక నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే మాత్రం ఆ మహానగరం అనుకూలం కాదని మరికొందరు అన్నారు.


ఇవీ చదవండి:

లగ్జరీ హోటల్‌లో షాకింగ్ ఘటన.. దంపతులు బాత్రూమ్‌లో ఉండగా..

గొర్రెల మంద ‘దాడి’.. సూపర్ మార్కెట్‌లోకి ఒక్కసారిగా 50 గొర్రెలు..

Updated Date - Jan 09 , 2026 | 10:59 PM