Luxury Hotel Privacy Breach: లగ్జరీ హోటల్‌లో షాకింగ్ ఘటన.. దంపతులు బాత్రూమ్‌లో ఉండగా..
ABN , Publish Date - Jan 09 , 2026 | 09:28 PM
లగ్జరీ హోటల్‌లో దిగిన ఓ దంపతులకు షాకింగ్ అనుభవం ఎదురైంది. వారు బాత్రూమ్‌లో ఉండగా హోటల్ సిబ్బంది వద్దన్నా వినకుండా గదిలోకి రావడంతో షాకయ్యారు. దీనిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయడంతో న్యాయం దక్కింది. బాధితులకు రూ.10 లక్షలు చెల్లించాలని హోటల్‌ను వినియోగదారుల ఫోరం ఆదేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్‌కు టూర్‌పై వెళ్లిన ఓ జంటకు షాకింగ్ అనుభవం ఎదురైంది. లగ్జరీ హోటల్‌లో దిగిన ఆ దంపతులు బాత్రూమ్‌లో ఉండగా హోటల్ సిబ్బంది దూసుకొచ్చి వారి ప్రైవసీకి భంగం కలిగించారు. దీంతో, బాధితులు వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా వారికి హోటల్ యాజమాన్యం రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఫోరం ఆదేశించింది. ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, చెన్నైకి చెందిన ఆ జంట గతేడాది జనవరి 26న లీలా ప్యాలెస్‌లో ఒక్క రాత్రి కోసం గదిని బుక్ చేసుకున్నారు. వారు వాష్‌రూమ్‌లో ఉన్న సమయంలో హోటల్ సిబ్బంది మాస్టర్ తాళం చెవితో గది తలుపు తెరుచుకుని లోపలికి వచ్చేశారు. తాము వద్దంటున్నా వినకుండా గది శుభ్రం చేసేందుకు లోపలికొచ్చి బాత్రూమ్‌లో ఉన్న తమను చూశారని ఆరోపించారు. తమ ప్రైవసీకి భంగం కలిగించారని ఆరోపించారు. వెంటనే హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఆశించిన స్పందన కరువైందని అన్నారు. దీంతో, వారు చెన్నైలోని జిల్లా వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వినియోగదారుల ఫోరం ఆ జంటకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అధిక ధర చెల్లించి లగర్జీ హోటల్స్‌లో దిగే కస్టమర్లు ప్రైవసీ కోరుకుంటారని ఫోరం అభిప్రాయపడింది. ప్రైవసీని కల్పించాల్సిన కనీస బాధ్యత హోటల్‌దేనని స్పష్టం చేసింది. కానీ ఈ స్థాయిలో బాధితుల ప్రైవసీకి భంగం కలిగించడం తీవ్రమైన సేవాలోపమని అభిప్రాయపడింది. ఇందుకు పరిహారంగా రూ.10 లక్షలను చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా, జంట చెల్లించిన రూమ్ రెంట్‌ను తిరిగివ్వాలని చెప్పింది. దీంతో పాటు దంపతులు హోటల్‌లో చేరిన నాటి నుంచి డబ్బు చెల్లించే నాటి వరకూ రెంట్‌పై 9 శాతం వార్షిక వడ్డీని లెక్కగట్టి ఇవ్వాలని పేర్కొంది. లీగల్ ఖర్చుల కింద మరో రూ.10 వేలు చెల్లించాలని కూడా తాజాగా ఆదేశించింది.
ఈ తీర్పుపై హోటల్ యాజమాన్యం కూడా స్పందించింది. కస్టమర్ల సౌకర్యం, ప్రైవసీకే తమ తొలి ప్రాధాన్యత అని పేర్కొంది. తీర్పును పరిశీలించాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
ఇవీ చదవండి:
గొర్రెల మంద ‘దాడి’.. సూపర్ మార్కెట్‌లోకి ఒక్కసారిగా 50 గొర్రెలు
సీసీటీవీలో షాకింగ్ దృశ్యం! వృద్ధురాలు లిఫ్ట్‌లో ఉండగా..