Chain Snatching Attempt: సీసీటీవీలో షాకింగ్ దృశ్యం! వృద్ధురాలు లిఫ్ట్‌లో ఉండగా..
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:28 PM
లిఫ్ట్‌లోని ఓ వృద్ధురాలి గొలుసును ఎత్తుకెళ్లేందుకు ఓ దొంగ ప్రయత్నించిన వైనం నెట్టింట వైరల్‌గా మారింది. గ్రేటర్ నోయిడాలోని ఓ రెసిడెన్షియల్ సొసైటీలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆ దొంగకు కనుచూపు మేరలో ఎక్కడా సెక్యూరిటీ సిబ్బంది కనబడలేదు. ఇదే సందు అనుకుని అతడు రెచ్చిపోయాడు. లిఫ్ట్‌లో వృద్ధురాలి గొలుసును దొంగిలించే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. గ్రేటర్ నోయిడాలో ఈ ఘటన వెలుగు చూసింది (Greater Noida Chain Snatching Attempt Video).
పూర్తి వివరాల్లోకి వెళితే, ఓ రెసిడెన్షియల్ సొసైటీలో నివసించే వృద్ధురాలు తన ఫ్లాట్‌కు వెళ్లేందుకు లిఫ్ట్ వద్దకు వెళ్లింది. అంతకుముందు నుంచే ఆమెను గమనిస్తున్న దొంగ వృద్ధురాలిని అనుసరించాడు. ముఖం కనబడకుండా హెల్మెట్ పెట్టుకున్న అతడు వృద్ధురాలితో పాటు లిఫ్ట్‌లోకి వెళ్లాడు. ఆమె మెడలోని గొలుసు చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా వృద్ధురాలు పెద్ద పెట్టున కేకలు పెట్టింది. గట్టిగా అరుస్తూ చుట్టుపక్కల ఉన్న వారిని అప్రమత్తం చేసే ప్రయత్నం చేసింది. వృద్ధురాలు అలా చేస్తుందని ఊహించని దొంగ షాకైపోయాడు. వెంటనే లిఫ్ట్ లోంచి బయటకు పరుగుతీశాడు. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇక ఘటన సమయంలో అక్కడ సెక్యూరిటీ ఎవ్వరూ కనిపించకపోవడంతో వివాదానికి దారి తీసింది.
ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళనకరమని సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నెలనెలా మెయింటెనెన్స్ చార్జీలు భారీగా చెల్లిస్తున్నా భద్రతా చర్యలు చేపట్టడంలో సొసైటీ మేనేజ్‌మెంట్ తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఈ తీరు వల్ల వృద్ధులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ వైరల్ వీడియోపై నెట్టింట కూడా పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అపార్ట్‌మెంట్‌లు, సొసైటీల్లో సెక్యూరిటీ లేకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. ఇక గ్రేటర్ నోయిడాలో తరచూ చెయిన్ స్నాచింగ్ ఘటనలు వెలుగు చూడటంపై అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:
రెస్టారెంట్‌లో దారుణం.. రోటీపై ఉమ్మేసి.. వైరల్ వీడియో
అయ్యో.. నా బిడ్డకు ఎంత కష్టం.. తండ్రి వేదన నెట్టింట వైరల్