Ghaziabad Viral Video: రెస్టారెంట్‌లో దారుణం.. రోటీపై ఉమ్మేసి.. వైరల్ వీడియో
ABN , Publish Date - Jan 09 , 2026 | 02:58 PM
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లోగల ఓ రెస్టారెంట్‌లో వర్కర్ రోటీలపై ఉమ్మేసిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియోపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: నేటి బిజీ జమానాలో ప్రజలకు బయటి ఫుడ్స్ తినక తప్పనిసరి పరిస్థితి. దీంతో, కొందరు రెస్టారెంట్స్‌కు వెళ్లి తింటే మరికొందరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టి ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఇలా తరచూ బయట తినే వారికి రోత పుట్టించే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో వెలుగు చూసిన ఈ వీడియో ప్రస్తుతం జనాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది (Spitting on Roti, Ghaziabad Viral Video).
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, స్థానిక రెస్టారెంట్‌లోని ఓ వర్కర్ రోటీలు తయారు చేసే క్రమంలో వాటిల్లో ఉమ్మేశాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ దారుణాన్ని రికార్డు చేసి నెట్టింట పంచుకోవడంతో కలకలం రేపుతోంది.
జనవరి 8న ఈ వీడియో అధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే వారు రంగంలోకి దిగారు. మధుబన్ బాపూధామ్ పోలీస్ స్టేషన్ పోలీసులు వీడియోను సమీక్షించాక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద ఆ వర్కర్‌పై కేసు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇక ఈ వీడియోపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఘాజియాబాద్‌లో గతంలో కూడా ఇలాంటి దారుణాలు వెలుగు చూశాయని చెప్పారు. బయటి ఫుడ్ తినాలంటే పలుమార్లు ఆలోంచాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వెలుగు చూసిన ఓ ఘటనలో వ్యాపారి ఒకరు పండ్ల రసాల్లో మూత్రం కలిపి జనాలకు విక్రయించిన ఘటన కలకలం రేపింది. ఈ దారుణానికి ఒడిగట్టిన షాపు ఓనర్‌తో పాటు అతడి వద్ద పనిచేసే వర్కర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా రెస్టారెంట్లు, ఫుడ్ షాపుల్లో ప్రభుత్వ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
అయ్యో.. నా బిడ్డకు ఎంత కష్టం.. తండ్రి వేదన నెట్టింట వైరల్
సామాన్యుడి దుర్భర జీవితం.. నెట్టింట బీభత్సం సృష్టిస్తున్న వీడియో