Life of Common Man: సామాన్యుడి దుర్భర జీవితం.. నెట్టింట బీభత్సం సృష్టిస్తున్న వీడియో
ABN , Publish Date - Jan 05 , 2026 | 02:53 PM
రైలెక్కేందుకు ఓ సామాన్య ప్రయాణికుడు నానా అవస్థలు పడ్డ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై పెద్ద ఎత్తున స్పందిస్తున్న జనాలు రకరకాల కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో జీవన ప్రమాణాలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది. రైలెక్కేందుకు ఓ సామాన్యుడు పడ్డ కష్టానికి సంబంధించిన వీడియోపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. పరిస్థితులు ఎప్పటికైనా మారతాయా అంటూ నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు (Life of Commoner in India Viral Video).
20 సెకెన్ల నిడివి మాత్రమే ఉన్న ఈ వీడియోలో ఓ సామాన్య ప్రయాణికుడు రైలు ఎక్కేందుకు నానా అవస్థలు పడ్డాడు. అప్పటికే రైలు బోగీలన్నీ నిండిపోవడంతో అతడికి లోపల కాలుపెట్టేందుకు చోటే లేకుండా పోయింది. దీంతో, అతడు ప్రమాదకరమైన రీతిలో బోగీ తలుపు వద్ద ఉన్న మెట్లపై నిలబడి ప్రయాణించాడు.
బరువైన బస్తాలను మోసుకుంటూ అతడు మొదట ఒక బోగీలో ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తరువాత పరిగెత్తకుంటూ వెళ్లి ముందున్న మరో బోగీలో మెట్లపై నిలబడి ప్రమాదకర రీతిలో జర్నీ చేశాడు. అసలు ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో స్పష్టత లేకపోయినా తెగ వైరల్ అవుతోంది. ‘భారత్‌లో సామాన్యుడి జీవితం ఇదీ’ అన్న కాప్షన్‌తో ఓ వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశారు.
దాదాపు 7 లక్షల వ్యూస్ ఉన్న ఈ వీడియోపై కామెంట్స్ కూడా అదే స్థాయిలో వచ్చి పడ్డాయి. ఎన్నారైలు కూడా భారీ ఎత్తున ఈ వీడియోపై స్పందించారు. కెనడాలో ఉంటున్న ఓ భారత సంతతి విశ్లేషకుడు జయంత్ భండారీ ఈ వీడియోపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘భారతీయులు పురుగుల్లా బతుకుతూ చివరకు తనవు చాలిస్తున్నారు. పురుగుల్లాంటి వ్యక్తులను పాలకులుగా ఎన్నుకుంటున్నారు. ఇలా ఎన్నికైన వారు మళ్లీ సామాన్యులను పురుగుల్లా చూస్తున్నారు’ అని అన్నారు. ఈ కామెంట్‌పై అనేక మంది ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితుల్లో మార్పు ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. సామాన్యులు ఎమైపోతున్నా ఎవరికీ పట్టడం లేదని నిర్వేదం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి:
బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ
కొత్త ఏడాదిలో కొత్త క్యాలెండర్ తెచ్చుకున్నారా? దీని వెనకున్న అసలు కథ ఏంటో తెలుసా?