Job Dilemma: అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!
ABN , Publish Date - Dec 12 , 2025 | 10:39 PM
రూ.1.3 కోట్ల శాలరీ ఆఫర్‌తో అంటార్కిటికాలో జాబ్ వస్తే వెళ్లాలో వద్దో తేల్చుకోలేక ఓ యువకుడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. జనాలు రకరకాల కామెంట్స్ చేస్తూ ఈ పోస్టును నెట్టింట ట్రెండింగ్‌లోకి తెచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: అంటార్కిటికా ఖండంలో గడ్డకట్టే వాతావరణంలో ఆరు నెలల జాబ్. జీతం ఏకంగా రూ.1.3 కోట్లు. ఇది ఓ యువకుడి ముందున్న ఆఫర్. అయితే, అప్పటికే అతడు ఓ యువతితో మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఇంతకాలం దూరంగా ఉంటే తమ బంధం బలహీనపడొచ్చన్న భయం అతడిన వెంటాడుతోంది. కానీ ఇది లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే వచ్చే జాబ్ ఆఫర్. దీంతో, డైలమాలో పడిపోయిన యువకుడు తనకు మార్గనిర్దేశనం చేయాలంటూ నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (McMurdo Station Antartica Job Offer).
రెడిట్‌లో సదరు యువకుడు ఈ పోస్టు పెట్టాడు. తాను పర్యావరణ పరిశోధకుడినని చెప్పాడు. అంటార్కిటికాలోని మెక్‌మర్డో స్టేషన్‌లో ఆరు నెలల పాటు కాంట్రాక్ట్ ప్రాదిపదికన ఓ ప్రాజెక్టుపై పనిచేస్తే రూ.1.3 కోట్ల జీతం వస్తుందని చెప్పాడు. జీతంతో పాటు వసతి, తిండి ఖర్చులు అన్నీ సంస్థే భరిస్తుందని చెప్పాడు. అయితే, తాను ఓ మహిళతో మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, ఇంతకాలం పాటు దూరంగా, అదీ అంటార్కిటికా లాంటి చోట ఉంటే తమ బంధం బలహీనపడే ప్రమాదం ఉందని చెప్పాడు.
కెరీర్ పరంగా తన నిర్ణయాలను గర్ల్‌ఫ్రెండ్ సమర్ధిస్తున్నప్పటికీ ఆరు నెలల కాల వ్యవధి విషయంలో ఆమెకూ కొంత విముఖత ఉందని అన్నాడు. దీంతో తాను ఎటూ తేల్చుకోలేక పోతున్నానని చెప్పాడు. ఇప్పటికే తన వద్ద రూ.1.62 కోట్లు ఉన్నాయని కూడా చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ తనకొచ్చిన ఆఫర్ ఏ రకంగా చూసినా చాలా ఎక్కువేనని అన్నాడు. అంటార్కిటికాలో అంతకాలం ఒంటరిగా ఉండటం సబబేనా, ఇది తన కెరీర్‌కు ఉపయోగపడుతుందా? అని నెట్టింట ప్రశ్నించాడు.
ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అనేక మంది అతడిని అంటార్కిటికా జాబ్‌ను తీసుకోమని సూచించారు. ఆ డబ్బుతో అతడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ కావొచ్చని అన్నారు. అతడికి కెరీర్‌లో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇక అంటార్కిటికాలో గతంలో పని చేసిన ఓ వ్యక్తి కూడా స్పందించాడు. అక్కడ పనిచేసే అవకాశం వస్తే వదులుకోకూడని, పరిశోధన కార్యకలాపాలు అద్భుతంగా ఉంటాయని అన్నారు.
ఇవీ చదవండి:
జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..
ఈ మహిళ ఏ టూత్ పేస్టు వాడుతోందో గానీ.. వైరల్ వీడియో.. షాకింగ్ సీన్స్