America Driverless bus : డ్రైవర్‌ అక్కర్లేని బస్సు!

ABN , First Publish Date - 2023-08-20T04:09:41+05:30 IST

బస్సు వెళ్తోంది.. స్టాప్‌ రాగానే ఆగింది.. కొందరు ప్రయాణికులు దిగారు.. మరికొందరు ఎక్కారు.. బస్సు సాగిపోతూనే ఉంది. దీంట్లో విశేషం ఏమిటనుకుంటున్నారా? ఆ బస్సులో డ్రైవర్‌ లేడు.

America  Driverless bus : డ్రైవర్‌ అక్కర్లేని బస్సు!

స్టీరింగ్‌ లేని బండి..

అమెరికాలో ప్రయోగం విజయవంతం

బస్సులో సురక్షితంగా జనం ప్రయాణం

ప్రజారవాణా వ్యవస్థలో కీలక మలుపు

శాన్‌ఫ్రాన్సిస్కో, ఆగస్టు 19: బస్సు వెళ్తోంది.. స్టాప్‌ రాగానే ఆగింది.. కొందరు ప్రయాణికులు దిగారు.. మరికొందరు ఎక్కారు.. బస్సు సాగిపోతూనే ఉంది. దీంట్లో విశేషం ఏమిటనుకుంటున్నారా? ఆ బస్సులో డ్రైవర్‌ లేడు. కనీసం స్టీరింగ్‌ కూడా లేదు. అయినా, బస్సు నిరాటంకంగా నడుస్తూనే ఉంది. సైన్స్‌ఫిక్షన్‌ సినిమాల్లోనే కనిపించే ఇటువంటి బస్సు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో నిజంగానే సాకారమైంది. పైలట్‌ ప్రాజెక్టు కింద అధికారులు ఈ బస్సును నడిపించారు. శుక్రవారం ట్రెజర్‌ అనే ద్వీపం చుట్టూ ఈ వినూత్న బస్సు చక్కర్లు కొట్టింది. ఎటువంటి సమస్య లేకుండా 20నిమిషాల వ్యవధిలో బస్సు ద్వీపాన్ని చుట్టింది. ఇది ఎలక్ట్రిక్‌ బస్సు. ఇందులో డ్రైవరు ఉండడు. ఒక అటెండెంట్‌ ఉంటాడు. అత్యవసర పరిస్థితి ఏదైనా తలెత్తితే ఈ అటెండెంట్‌ బస్సును అదుపులోకి తీసుకొస్తాడు.

Updated Date - 2023-08-20T04:09:41+05:30 IST