Coconut Peeling Video: ఈ మహిళ ఏ టూత్ పేస్టు వాడుతోందో గానీ.. వైరల్ వీడియో.. షాకింగ్ సీన్స్
ABN , Publish Date - Dec 11 , 2025 | 04:34 PM
కొబ్బరి బొండాం పీచును నోటితో ఒలిచిన ఓ ఒడిశా మహిళ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. మరి ఈ ఇంటరెస్టింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇంటర్నెట్ డెస్క్: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ఈ ప్రయోజనాలు పొందాలంటే కాస్త కష్టపడాలి. కొబ్బరి పీచు తీసేందుకు కొడవలి కావాలి. దానితో పీచు మొత్తాన్ని తొలగించాకే కొబ్బరి నీళ్లను ఆస్వాదించగలం. కొబ్బరి పీచు తీసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా చిక్కుల్లో పడాల్సి వస్తుంది. అయితే, ఒడిశాకు చెందిన ఓ మహిళ మాత్రం కొబ్బరి పీచు మొత్తాన్ని తన పంటితో ఒలిచి పారేసింది. ఈ ఆశ్చర్యకర సీన్స్‌ను ఓ వ్యక్తి కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది (Odisha Woman Peeling Coconut - Viral Video).
@india_eat_mania అనే ఇన్‌స్టా అకౌంట్‌లో ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, తొలుత ఆ మహిళ కొబ్బరి పీచును పంటితో లాగేస్తానని చెప్పింది. వీడియో రికార్డు చేస్తున్న వ్యక్తి ఇది విని షాకయిపోయాడు. నిజంగానా? అంటూ సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఆమేమో అవునని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. అన్నట్టుగానే పంటితో కొబ్బరి పీచును మొత్తాన్ని తొలగించింది. దీంతో, ఎదురుగా ఉన్న వ్యక్తి షాయిపోయాడు.
వాస్తవానికి అతడు తొలుత మహిళ చెప్పింది నమ్మలేదు. కొన్ని నిమిషాల తరువాత మహిళ తన ప్రయత్నాన్ని విరమిస్తుందని అనుకున్నాడు. కానీ పీచు మొత్తాన్ని ఒలిచేయడంతో అబ్బురపడ్డాడు. చప్పట్లు కొట్టాడు. ఇలాంటి సాహసాలు చేయడం తనకు సాధారణమని ఆ మహిళ కాన్ఫిడెన్స్‌గా ఉట్టిపడేలా చెప్పింది. తనకు బుల్లెట్ బైక్ నడపడం కూడా ఈజీనే అని చెప్పింది. తరువాత కొబ్బరి నీళ్లను గ్లాసులో పోసి ఇచ్చింది. దీంతో, ఆమె టాలెంట్‌కు తిరుగేలేదంటూ జైకొట్టాడు.
ఇక ఈ వీడియో నెట్టింట కూడా నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. జనాలు ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఏ టూత్ పేస్టు వాడుతున్నారో చెప్పాలని అన్నారు. ఒడిశావాళ్ల టాలెంట్ మామూలుగా ఉండదని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య తెగ వైరల్ అవుతున్న ఈ వీడియపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
గూగుల్ ట్రెండ్స్‌లో ‘777’ హల్‌చల్.. అసలు స్టోరీ ఏంటంటే..
నాకూ ఇంటికి వెళ్లాలని ఉంది.. ఇండిగో పైలట్ వీడియో నెట్టింట వైరల్