JBL Speaker Viral Video: ఇలాక్కూడా జరుగుతుందా! ఇదేంటో తెలిస్తే.. వైరల్ వీడియో
ABN , Publish Date - Jan 04 , 2026 | 03:17 PM
సముద్రంలో మూడు నెలల పాటు తేలియాడిన జేబీఎల్ స్పీకర్ చెక్కుచెదరలేదంటూ ఓ వ్యక్తి నెట్టింట షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇంటర్నెట్ డెస్క్: ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై నీరు పడితే ఏం జరుగుతోందో దాదాపు అందరికీ తెలుసు. అందుకే, నీటిని తట్టుకునే వాటర్‌ప్రూఫ్ ఉపకరణాల విషయంలో కూడా జనాలు జాగ్రత్తగా ఉంటారు. రిస్క్ ఎందుకులే అన్న భావనతో వాటిపై చుక్క నీరు కూడా పడనీయరు. కానీ మూడు నెలల పాటు సముద్రంలో తేలియాడిన తరువాత కూడా బ్లూటూత్ స్పీకర్ చెక్కు చెదరకుండా ఉందంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండవుతోంది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది (JBL Speaker Viral video).
జేబీఎల్ కంపెనీకి చెందిన ఓ బ్లూటూత్ స్పీకర్ తనకు సముద్రపు ఒడ్డున కనిపించిందంటూ ఓ వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశారు. ఆ స్పీకర్‌పై రకరకాల సముద్రపు నాచు, ఇతర జీవాలు పేరుకున్నట్టు వీడియోలో కనిపించింది. మూడు నెలలుగా సముద్రంలో తేలి చివరకు ఒడ్డుకు కొట్టుకొచ్చిందని అన్నాడు. కానీ, ఆన్ చేయగానే మొబైల్ బ్లూటూత్‌కు కనెక్ట్ అయ్యిందని, చక్కగా పని చేసిందని కూడా చెప్పుకొచ్చాడు. ఆ స్పీకర్ ద్వారా ఓ పాటను ప్లే చేసి కూడా వినిపించాడు.
నమ్మశక్యం కానట్టు ఉన్న ఈ వీడియో సహజంగానే జనాలను అమితంగా ఆకట్టుకుంది. దీంతో, గత కొన్ని రోజులుగా ట్రెండింగ్‌లోనే కొనసాగుతోంది. ఈ వీడియోకు ఏకంగా 1.7 కోట్ల వ్యూస్ వచ్చాయి. అనేక మంది దీన్ని చూసి ఆశ్చర్యపోయారు. జేబీఎల్ సంస్థ కాకుండా నాసా దీన్ని తయారు చేసినట్టు ఉందని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. బుద్ధిజీవులైన కొందరు నెటిజన్లు మాత్రం ఈ వీడియోపై రకరకాల సందేహాలు వ్యక్తం చేశారు. అది అసలు సముద్రంలో మూడు నెలల పాటు తేలియాడినట్టు మీకెలా తెలుసని కొందరు ప్రశ్నించారు. జేబీఎల్ కంపెనీ కోసం పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారా? అని కొందరు ప్రశ్నించారు. మరి జనాల్లో ఇంతలా ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ వీడియోపై మీరూ లుక్కేయండి.
ఇవీ చదవండి:
వీడియో షేర్ చేసిన మహిళ.. నమ్మలేకపోతున్న నెటిజన్లు! ఇది కలా? నిజమా?
కొత్త ఏడాదిలో కొత్త క్యాలెండర్ తెచ్చుకున్నారా? దీని వెనకున్న అసలు కథ ఏంటో తెలుసా?