Indian Beaten Up In Thailand: షాకింగ్ వీడియో.. థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్‌జెండర్‌ల దాడి!
ABN , Publish Date - Jan 05 , 2026 | 10:14 PM
థాయ్‌లాండ్‌లో ఓ భారతీయుడిపై స్థానిక ట్రాన్స్‌జెండర్‌లు దాడి చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. డబ్బుల విషయంలో వారి మధ్య తగాదా మొదలైనట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: థాయ్‌లాండ్‌లో ఓ భారతీయుడిపై స్థానిక ట్రాన్స్‌జెండర్‌లు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది (Indian Beaten Up In Thailand Viral Video).
స్థానిక మీడియా కథనాల ప్రకారం, డిసెంబర్ 27 తెల్లవారుజామున పట్టాయ వాకింగ్ స్ట్రీట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. డబ్బులు చెల్లించనందుకు భారతీయుడిపై కొందరు ట్రాన్స్‌జెండర్ సెక్స్ వర్కర్లు ఇష్టారీతిన దాడి చేశారట. ఘటన సమాచారం అందడంతో ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది అక్కడకు చేరుకుని బాధితుడిని రక్షించారు. అతడిని 52 ఏళ్ల రాజ్ జసూజాగా గుర్తించారు. అతడి ముఖం, తల వెనుక భాగాలపై గాయాలయ్యాయి. మొదట అతడికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం పట్టామకూన్ ఆసుపత్రికి తరలించారు. రాజ్ జసూజాను ట్రాన్‌జెండర్‌లు పరుగెత్తించి, కాలితో తన్నుతూ ఇష్టారీతిన దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది.
బాధితుడికి ఓ ట్రాన్స్‌జెండర్‌కూ మధ్య తొలుత వాగ్వాదం జరిగినట్టు స్థానికుడు ఒకరు మీడియాకు తెలిపారు. ఆ తరువాత ఆ ట్రాన్స్ జెండర్ తన స్నేహితులకు ఫోన్ చేసి పిలవడంతో వివాదం ఒక్కసారిగా ముదిరిపోయింది. వారందరూ బాధితుడిపై ఇష్టారీతిన దాడి చేశారు. అయితే, వివాదం ఎందుకు మొదలైందనే విషయంపై స్థానిక అధికారులు ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని మాత్రం చెప్పారు. ఇక ఘటన తాలూకు వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి.
ఇవీ చదవండి:
సామాన్యుడి దుర్భర జీవితం.. నెట్టింట బీభత్సం సృష్టిస్తున్న వీడియో
అమెరికా యాత్రకు భారత్ నుంచి వీధి కుక్క.. అసలు ఏం జరుగుతోందంటే..