Thar Wrong Side Driving: మహీంద్రా థార్ కారు నడుపుతూ సంచలన కామెంట్.. నెట్టింట వెల్లువెత్తుతున్న ఆగ్రహం
ABN , Publish Date - Jan 12 , 2026 | 03:06 PM
మహీంద్రా థార్ ఎస్‌యూవీ కారును కొనుగోలు చేస్తే ఇదే బెనిఫిట్ అంటూ ఓ వ్యక్తి వాహనాన్ని రాంగ్ రూట్‌లో డ్రైవ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు ఈ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మహీంద్రా థార్ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అనేక మంది ఆ కారు ఓనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి కార్లను విక్రయించవద్దని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది (Mahindra Thar Driving Video).
ఎస్‌యూవీ కారు కొనుగోలు చేశానన్న అహంకారంతో ఓ వ్యక్తి రెచ్చిపోయిన వీడియో ఇది. బెనిఫిట్స్ ఆఫ్ థార్ అన్న క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేసిన ఓ నెటిజన్ చేస్తూ.. ఆ కారు ఓనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, కారు ఓనర్ తన వాహనాన్ని రాంగ్ రూట్‌లో డ్రైవ్ చేస్తూ అహంకారం, దురుసుతనంతో నోటికొచ్చినట్టు మాట్లాడాడు. రాంగ్ రూట్‌లో వాహనం నడిపేందుకే తాను థార్ కారును కొనుగోలు చేసినట్టు చెప్పుకొచ్చాడు. ‘మహీంద్రా థార్ కొనుగోలుతో వచ్చే అతి పెద్ద ఉపయోగం ఇదే. మీరు హ్యాపీగా రాంగ్ రూట్‌లో కారును నడపవచ్చు. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఎవరూ మిమ్మల్ని పల్లెత్తుమాట కూడా అనరు. ఇందుకోసమే నేను రూ.20 లక్షలు పెట్టి కొనుగోలు చేశా. ఈ ఫీలింగ్‌యే వేరు’ అని కారు నడుపుతూ ఆ వ్యక్తి ఇష్టారీతిన రెచ్చిపోయాడు.
ఈ వీడియో షేర్ చేసిన వ్యక్తి సదరు కారు ఓనర్‌పై త్రీవ విమర్శలు చేశారు. ఎస్‌యూవీలను కొనుగోలు చేసే అనేక మందిలో ఈ మధ్య ఇలాంటి దురహంకారం కనిపిస్తోందని అన్నారు. తమను ఎవరూ ఏమీ చేయలేరన్నట్టు అహంభావంతో రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఇక వీడియోపై జనాలు కూడా ఓ రేంజ్‌లో కామెంట్స్ చేశారు. ఇలాంటి తీరున్న వారికి మహీంద్రా ఎస్‌యూవీ కార్లను విక్రయించకూడదని అభిప్రాయపడ్డారు. కస్టమర్ల మానసిక స్థితి సరిగా ఉందని చెప్పే మెంటల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తీసుకున్నాకే కార్లను విక్రయించాలని కొందరు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు.
ఇవీ చదవండి:
ప్రధాని మోదీకి లేఖ! ఆయన రిప్లై చూశాక..
యూకేలో ఎన్నారై యువతికి షాక్! పరాఠాలపై మనసు పోవడంతో..