అభిషేక్ చేసిన పనికి ఫిదా అయిన గావస్కర్.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:30 PM
నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. యంగ్ హిట్టర్ అభిషేక్ శర్మ(35 బంతుల్లో 84 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో .. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న అభిషేక్.. మ్యాచ్ అనంతరం భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కాళ్లకు మొక్కాడు.
స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ప్రారంభించింది. నిన్న(బుధవారం) నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో(IND vs NZ T20 ) టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. యంగ్ హిట్టర్ అభిషేక్ శర్మ(35 బంతుల్లో 84 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో .. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అభిషేక్ అందుకున్నాడు. ఇదిలా ఉండగా.. మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అభిషేక్ శర్మ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar) కాళ్లకు మొక్కాడు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. వివరాల్లోకి వెళ్తే...
టీమిండియా విజయం ఖాయమైన అనంతరం అభిషేక్ శర్మ(Abhishek Sharma) మైదానంలోకి వస్తున్నాడు. ఇదే సమయంలో కామెంటేటర్‌గా ఉన్న గావస్కర్ కనిపించాడు. దీంతో అభిషేక్ పరుగెత్తుకుంటూ వెళ్లి.. గావస్కర్ కాళ్లు మొక్కాడు. అనంతరం ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అభిషేక్ శర్మపై ప్రశంసల జల్లు కురిపించిన గావస్కర్.. అతని విధ్వంసకర బ్యాటింగ్‌తో తన ఆటను పోల్చుతూ సరదా వ్యాఖ్యలు చేశాడు. తాను ఖాతా తెరవడానికి 22 బంతులు ఆడితే అభిషేక్ శర్మ అన్ని బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేస్తున్నాడంటూ ప్రశంసించాడు. అప్పటి క్రికెట్‌కు, ఇప్పటి క్రికెట్‌కు ఎంత తేడా ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చని అన్నారు.
'ఇది భయంలేని ఆటనే కదా?' అని అభిషేక్ శర్మను గావస్కర్ ప్రశ్నించాడు. పక్కా ప్రణాళికతో కూడిన ఇంటెంట్ అని, భారత జట్టు మేనేజ్‌మెంట్ పవర్ ప్లేలో దూకుడుగా ఆడాలనే బాధ్యత తనకు ఇచ్చిందని సమాధామిచ్చాడు అభిషేక్. తాను రేంజ్ హిట్టింగ్ కంటే టైమింగ్‌పైనే ఎక్కువ ఆధారపడతానని, నెట్స్‌లో తన షాట్లపై బాగా వర్క్ చేస్తానని అభిషేక్ వెల్లడించాడు. బౌలర్లు తనను ఎక్కడ టార్గెట్ చేస్తున్నారో, దానికి తగ్గట్లు ఎలా ఆడాలనేదానిపై ప్రత్యేక శ్రద్ధ పెడతానని వివరించాడీ టీ20 స్టార్ ఓపెనర్.
ఈ వార్తలు కూడా చదవండి..
చరిత్ర సృష్టించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు
అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఒక అద్భుతం!