Share News

నా ఫేవరెట్ టాలీవుడ్ హీరో అతనే: అభిషేక్ శర్మ

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:01 PM

భారత యువ హిట్టర్ అభిషేక్ శర్మ తెలుగులో తన ఫేవరెట్ హీరో ఎవరో వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్.. హైదరాబాద్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

నా ఫేవరెట్ టాలీవుడ్ హీరో అతనే: అభిషేక్ శర్మ
Abhishek Sharma

స్పోర్ట్స్ డెస్క్: భారత యువ హిట్టర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అభిషేక్ గ్రౌండ్‌లోకి వస్తే.. ప్రత్యర్థి బౌలర్లు షేక్ అవుతారంటే అతిశయోక్తి కాదు. అతడిని ఔట్ చేస్తే.. సగం మ్యాచ్ గెలిచినట్లుగా ప్రత్యర్థి జట్లు భావిస్తుంటాయి. అలానే తన విధ్వంసకరమైన బ్యాటింగ్‌తో అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. అతడి ఆటను చూసేందుకే చాలా మంది స్టేడియాలకు వెళ్తుంటారు. కాగా.. అభిషేక్ శర్మ రెండు తెలుగు రాష్ట్రాల వారికి సుపరిచితమే. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ఈ యంగ్ ప్లేయర్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. దీంతో తెలుగు రాష్ట్రాలతో అతడికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్ శర్మ.. తన ఫేవరేట్ టాలీవుడ్ హీరో ఎవరో వెల్లడించాడు.


ఇంటర్వ్యూలో అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. తనకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అంటే చాలా ఇష్టమని చెప్పాడు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఆయన క్రేజ్ గురించి తెలుగు ఆటగాళ్లను అడిగి తెలుసుకుంటానని, ఖాళీ సమయాల్లో మహేష్ బాబు సినిమాలు చూస్తానని తెలిపాడు. అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమా తనను అమితంగా ఆకట్టుకుందని అన్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేనరిజమ్ తనను బాగా నచ్చిందని వెల్లడించాడు. తెలుగు ప్లేయర్లు నితీష్ రెడ్డి, తిలక్ వర్మల సాయంతో తెలుగు డైలాగ్స్ నేర్చుకుంటానని చెప్పాడు. హైదరాబాద్‌ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. ఇదే సమయంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై అభిషేక్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. ముఖ్యంగా నాటు నాటు పాట బాగుందని, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్ అద్భుతమని అభిషేక్ శర్మ కొనియాడాడు.


ఇక అభిషేక్ శర్మ క్రికెట్ విషయానికి వస్తే.. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో(New Zealand T20 series) విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్ము రేపుతున్నాడు. తొలి టీ20లో అర్ధ సెంచరీతో చెలరేగిన అభిషేక్.. రెండో టీ20లో మాత్రం గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఇక మూడో టీ20లో మాత్రం పరుగుల వరద పారించాడు. 14 బంతుల్లోనే అర్ధ శతకం బాది 10 ఓవర్లలోనే మ్యాచ్ ముగించాడు. విశాఖ వేదికగా జరిగిన నాలుగో టీ20లో మరోసారి అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. దాంతో ఈ మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.


ఇవి కూడా చదవండి:

ప్రపంచ కప్ -2026 నుంచి తప్పుకుంటే.. పాక్‌కు భారీ నష్టం!

ఇన్‌స్టాలో కానరాని విరాట్ కోహ్లీ అకౌంట్! అభిమానుల్లో టెన్షన్.. చివరకు..

Updated Date - Jan 30 , 2026 | 03:22 PM