Share News

ఇన్‌స్టాలో కానరాని విరాట్ కోహ్లీ అకౌంట్! అభిమానుల్లో టెన్షన్.. చివరకు..

ABN , Publish Date - Jan 30 , 2026 | 10:23 AM

శుక్రవారం ఉదయం కొన్ని గంటల పాటు విరాట్ కోహ్లీ ఇన్‌స్టా అకౌంట్ కనబడకపోవడం కలకలానికి దారి తీసింది. ఆ తరువాత మళ్లీ కనిపించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఇలా ఎందుకు జరిగిందో క్లారిటీ లేకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.

ఇన్‌స్టాలో కానరాని విరాట్ కోహ్లీ అకౌంట్! అభిమానుల్లో టెన్షన్.. చివరకు..
Virat Kohli Insta Account Disappears

ఇంటర్నెట్ డెస్క్: కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఇన్‌స్టా అకౌంట్ శుక్రవారం కొంత సేపు అదృశ్యం కావడంతో కలకలం రేగింది. కొన్ని గంటల తరువాత అకౌంట్‌ మళ్లీ కనిపించడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే, అసలు ఇలా ఎందుకు జరుగుతోందో అర్థంకాక నెటిజన్లు చర్చకు తెరలేపారు (Virat Kohli Insta Account Disappears).

ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ అకౌంట్‌ కోసం సెర్చ్ చేసిన వారికి మొదట అకౌంట్ లేదన్న సమాధానం రావడంతో కలకలానికి దారి తీసింది. అకౌంట్ డీయాక్టివేట్ అయ్యిందా? అన్న సందేహాలు మొదలయ్యాయి. సెర్చ్ ఫలితాల్లో విరాట్ కోహ్లీ అకౌంట్ కనిపించట్లేదంటూ కొందరు వాటి స్క్రీన్ షాట్స్‌ను నెట్టింట పంచుకున్నారు. ఇది చాలదన్నట్టు విరాట్ సోదరుడు వికాస్ అకౌంట్ కూడా అదే సమయంలో అదృశ్యం కావడంతో అసలు ఏం జరుగుతోందో అర్థంకాక జనాలు తెగ తికమకపడ్డారు.


ఈ క్రమంలో కొందరు అనుష్క అకౌంట్‌లో కామెంట్స్ వరద పారించారు. అకౌంట్ ఎందుకు అదృశ్యమైందని ప్రశ్నించారు. అయితే, ఈ అంశంపై అనుష్క శర్మ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో జనాల్లో ఆందోళన మరింత పెరిగింది. దీంతో, ఈ ఉదంతం ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈలోపు మళ్లీ విరాట్ కోహ్లీ అకౌంట్ సెర్చ్ ఫలితాల్లో కనిపించడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే, అసలు సడెన్‌గా కోహ్లీ ఇన్‌స్టా అకౌంట్ ఎందుకు మాయమైంది? మళ్లీ ఎందుకు ప్రత్యక్షమైంది? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు. కోహ్లీ నుంచి కూడా ఈ అంశంపై ఎలాంటి వివరణా లేదు. దీంతో సస్పెన్స్ మాత్రం యాథాతథంగా కొనసాగుతోంది. కోహ్లీకి ఇన్‌స్టాలో సుమారు 270 మిలియన్ ఫాలోవర్లు ఉన్న విషయం తెలిసిందే. కోహ్లీ అభిమానులు నిత్యం అతడి నుంచి అప్‌డేట్స్ కోసం ఎదురు చూస్తుంటారు. కోహ్లీ పోస్టులకు భారీ ఎత్తున స్పందిస్తుంటారు.


ఇవి కూడా చదవండి:

ప్రపంచ కప్ -2026 నుంచి తప్పుకుంటే.. పాక్‌కు భారీ నష్టం!

నా రిటైర్మెంట్‌‌కు కారణం అదే.. యువీ షాకింగ్‌ కామెంట్స్‌..

Updated Date - Jan 30 , 2026 | 10:56 AM