టీ20 ప్రపంచ కప్ 2026.. అతడు టీమిండియాకు కీలకం అవుతాడు: రికీ పాంటింగ్
ABN , Publish Date - Feb 04 , 2026 | 09:21 AM
టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. అయితే ప్రస్తుతం అందరి దృష్టి.. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోంది. టీమిండియా హాట్ ఫెవరేట్‌గా బరిలోకి దిగనుంది. అయితే ప్రస్తుతం అందరి దృష్టి.. విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మపైనే ఉంది. ఇప్పటికే అతడు టీ20 ఫార్మాట్లో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(Ricky Ponting) అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పై స్పందించాడు. గతంలో తాను అనుకున్నట్లే.. అభిషేక్ సూపర్ స్టార్ అయ్యాడని గుర్తు చేసుకున్నాడు.
‘ఐపీఎల్‌లో అభిషేక్(Abhishek Sharma)కు నేను తొలి కోచ్. అతను నాతో అరంగేట్రం చేశాడు. అప్పుడు 17 ఏళ్ల కుర్రాడిగా అభిషేక్ ఢిల్లీ తరఫున రాణించాడు. ఐపీఎల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో మొదటి బంతికే బౌలర్ తల మీదుగా ఫోర్ లేదా సిక్స్ బాదినట్లు గుర్తు. అతనిలో ఏదో ప్రత్యేకత ఉందని అప్పుడే అనుకున్నా. అభిషేక్‌ను ట్రేడ్ చేయొద్దని ఢిల్లీ మేనేజ్‌మెంట్‌ను పదే పదే కోరా. భవిష్యత్తులో ఈ కుర్రాడు సూపర్ స్టార్ అవుతాడని అనుకున్నా. ఇప్పుడే అదే జరిగింది.
రానున్న టీ20 ప్రపంచ కప్‌లో అభిషేక్ రాణిస్తాడని నమ్మకం ఉంది. అతడు టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకునే అవకాశం కూడా ఉంది. అతడికి ఆ సత్తా ఉంది. అభిషేక్ చెలరేగితే భారత్‌ను ఓడించడం మరింత కష్టతరం అవుతుంది. కాబట్టి.. ఈ ప్రపంచ కప్‌లో అభిషేక్ టీమిండియాకు చాలా కీలకమవుతాడు’ అని రికీ పాంటింగ్ అన్నాడు. ఢిల్లీ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ తన తొలి మ్యాచులోనే చెలరేగిపోయాడు. 19 బంతుల్లోనే 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 2019 సీజన్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్నాడు.
ఇవి కూడా చదవండి:
అప్పుడు హాకీ.. ఇప్పుడు క్రికెట్.. అరుదైన ఘనత సాధించిన ఇటలీ కెప్టెన్
అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!