Share News

పీసీబీపై చర్యలు

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:50 AM

ప్రపంచకప్‌లో ఈనెల 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేసినందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)పై ప్రసారకర్త జియో స్టార్‌ కోర్టుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు...

పీసీబీపై చర్యలు

ఐసీసీ హెచ్చరిక

కరాచీ/న్యూఢిల్లీ: ప్రపంచకప్‌లో ఈనెల 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేసినందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)పై ప్రసారకర్త జియో స్టార్‌ కోర్టుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఇప్పటికే పీసీబీని హెచ్చరించింది. పాక్‌ నిర్ణయంతో జియో స్టార్‌ ఆదాయంపై భారీ ప్రభావం పడనుంది. అటు ఐసీసీ కూడా పాక్‌కు అందించే వార్షిక ఆదాయం రూ.315 కోట్లను పూర్తిగా నిలిపివేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక ఒప్పంద ఉల్లంఘన కింద పీసీబీ, ఐసీసీపై కోర్టుకు వెళ్లే హక్కు స్టార్‌ గ్రూప్‌నకు ఉంటుంది. ‘పాక్‌ జట్టు భారత్‌తో మ్యాచ్‌ ఆడకపోతే జరిమానాలతో పాటు బ్రాడ్‌కాస్టర్‌ నుంచి కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఐసీసీ వివాద పరిష్కార కమిటీ (డీఆర్‌సీ)కి వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు కూడా విఫలమవుతాయి. ఇదిలావుండగా ఐసీసీ భారత్‌కు వంత పాడుతున్న నేపథ్యంలో, మరో గ్లోబల్‌ క్రికెట్‌ పాలక మండలి రావాల్సిన అవసరం ఉందని పాక్‌ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి:

అప్పుడు హాకీ.. ఇప్పుడు క్రికెట్.. అరుదైన ఘనత సాధించిన ఇటలీ కెప్టెన్

అభిమానులకు క్రేజీ న్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో అడుగుపెట్టనున్న చెన్నై సూపర్ కింగ్స్!

Updated Date - Feb 04 , 2026 | 09:25 AM