అప్పుడు హాకీ.. ఇప్పుడు క్రికెట్.. అరుదైన ఘనత సాధించిన ఇటలీ కెప్టెన్
ABN , Publish Date - Feb 03 , 2026 | 02:54 PM
క్రీడా చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడు 20 ఏళ్ల కింద ఓ దేశం తరఫున హాకీ ప్రపంచ కప్ ఆడి.. త్వరలో మరో దేశం తరఫున టీ20 ప్రపంచ కప్ ఆడనున్నాడు. అతడే సౌతాఫ్రికాకు చెందిన వేన్ మ్యాడ్‌సన్.
ఇంటర్నెట్ డెస్క్: క్రీడా చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడు 20 ఏళ్ల కిందట ఓ దేశం తరఫున హాకీ ప్రపంచ కప్ ఆడి.. త్వరలో మరో దేశం తరఫున టీ20 ప్రపంచ కప్ ఆడనున్నాడు. అతడే సౌతాఫ్రికాకు చెందిన వేన్ మ్యాడ్‌సన్(Wayne Madsen). ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్‌లో ఇటలీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఒకే ఆటగాడు రెండు వేర్వేరు దేశాల తరఫున.. వేర్వేరు క్రీడల్లో ప్రపంచ కప్ టోర్నీల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం.
2006లో దక్షిణాఫ్రికా తరఫున హాకీ వరల్డ్ కప్‌లో ఆడిన మ్యాడ్‌సన్.. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ 2026లో ఇటలీ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అప్పట్లో కేవలం 22 ఏళ్ల వయసులోనే దక్షిణాఫ్రికా హాకీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు ఓటములు, రెండు డ్రాలతో నిరాశపరిచింది. భారత్‌తో 1-1, దక్షిణ కొరియాతో 2-2తో మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 11వ స్థానం కోసం భారత్‌తో జరిగిన ప్లే ఆఫ్‌లో 0-1తో ఓడి చివరి స్థానంలో నిలిచింది.
ఇంగ్లండ్‌కు కూడా అర్హత
హాకీ వరల్డ్ కప్‌నకు ముందే మ్యాడ్‌సన్ దక్షిణాఫ్రికా క్రికెట్‌లో ఫస్ట్‌క్లాస్, లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడాడు. అనంతరం ఇంగ్లండ్‌కు వెళ్లి డర్బీషైర్ జట్టుకు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించాడు. ఆ క్రమంలో ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడే అర్హత కూడా సంపాదించాడు. అయితే దక్షిణాఫ్రికా గానీ, ఇంగ్లండ్ గానీ అతడికి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడే అవకాశం ఇవ్వలేదు.
2023 జులైలో జెర్సీతో జరిగిన మ్యాచ్ ద్వారా మ్యాడ్‌సన్ ఇటలీ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మొత్తంగా 219 టీ20 మ్యాచ్‌లు ఆడిన మ్యాడ్‌సన్.. 5,516 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 35 అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌లో ఇటలీ జట్టు శుభారంభం చేసింది. వార్మప్ మ్యాచ్‌లో తమకంటే ర్యాంకింగ్‌లో మెరుగైన కెనడాను ఓడించింది. ఇదే ఊపును వరల్డ్‌కప్‌లో కొనసాగించాలని ఇటలీ ఆశిస్తోంది.
ఇవి కూడా చదవండి:
హెచ్‌సీఏలో కీలక పరిణామం.. నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్
బాయ్‌కాట్ నష్టం రూ.2200 కోట్లు!