Vijay Hazare Trophy: అర్ష్‌దీప్ సింగ్ విజృంభణ.. 75 పరుగులకే కుప్పకూలిన సిక్కిం
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:21 PM
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపుర్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచులో పంజాబ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ తరఫున బరిలోకి దిగిన టీమిండియా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ విజృంభించడంతో సిక్కిం జట్టు విలవిల్లాడింది. కేవలం 22.2 ఓవర్లకే ఆ జట్టు కుప్పకూలింది.
ఇంటర్నెట్ డెస్క్: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపుర్ వేదికగా సిక్కింతో జరిగిన మ్యాచులో పంజాబ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సిక్కిం తొలుత బ్యాటింగ్‌కి దిగింంది. పంజాబ్ తరఫున బరిలోకి దిగిన టీమిండియా యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ విజృంభించడంతో సిక్కిం జట్టు విలవిల్లాడింది. కేవలం 22.2 ఓవర్లకే ఆ జట్టు కుప్పకూలింది. అర్ష్‌దీప్(Arshdeep Singh) బౌలింగ్ ధాటికి ప్లేయర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 75 పరుగులకే సిక్కిం ఆలౌటైంది.
తమంగ్(13), గురిందర్ సింగ్(10), సప్తుల్లా(10) వీరే టాప్ స్కోరర్స్. అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. సుఖ్‌దీప్, మార్కండే తలో రెండు, బ్రార్ ఒక వికెట్ పడగొట్టాడు.
76 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన పంజాబ్ కేవలం 6.2 ఓవర్లలో ఆటను ముగించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 81 పరుగులు చేసింది. దీంతో పది వికెట్ల తేడాతో సిక్కింపై ఘన విజయం సాధించింది. ఓపెనర్లు హర్నూర్ సింగ్(22), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(53) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇద్దరూ నాటౌట్‌గా నిలిచారు.
ఇవి కూడా చదవండి:
షాకింగ్.. ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ ఔట్
భారత ఫుట్‌బాల్‌ను కాపాడండి!.. ఫిఫాకు ఆటగాళ్ల విజ్ఞప్తి