IPL 2026: షాకింగ్.. ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ స్టార్ ప్లేయర్ ఔట్
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:39 AM
బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్‌ను బీసీసీఐ ఆదేశించింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌లో ఆడించొద్దని డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: అనుకున్నదే అయిందే.. ఎన్నో విమర్శలు.. ఆరోపణలు.. వీటన్నింటి నడుమ బంగ్లాదేశ్ ఆడగాడిని ఐపీఎల్ ఫ్రాంచైజీలోని కేకేఆర్ జట్టు దక్కించుకోలేకపోయింది. పొరుగు దేశంలో మత అల్లర్లు, హింసాత్మక ఘటనలు, రాజకీయ అస్థిరత నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్‌లోకి తీసుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం తీసుకుంది.
బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్(Mustafizur Rahman)ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్‌ను బీసీసీఐ ఆదేశించింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌లో ఆడించొద్దని డిమాండ్లు వినిపించిన నేపథ్యంలో బీసీసీఐ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ‘బంగ్లాదేశ్‌లో తాజా పరిణామాల దృష్ట్యా ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను రిలీజ్ చేయాలని కేకేఆర్‌ను ఆదేశించాం. అతడి స్థానంలో వేరే ఆటగాడిని రిప్లేస్ చేసుకోవచ్చని వెల్లడించాం’ అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా చెప్పుకొచ్చారు.
ఇటీవలే జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నైతో పోటీ పడి మరీ కోల్‌కతా నైట్ రైడర్స్ ముస్తాఫిజుర్‌ను రూ.9.2కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో అత్యధిక ధరకు ఆడనున్న తొలి బంగ్లా ప్లేయర్‌గా ముస్తాఫిజుర్ చరిత్ర సృష్టిస్తాడనుకునే లోపే ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇవి కూడా చదవండి:
ఆఖరి నిమిషంలో తుది జట్టుకు గిల్ దూరం.. కారణం అదేనా?
ఓ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైతే జట్టులోంచే తీసేస్తారా?: యోగ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు