Steve Smith: అతడు వెళ్లాడని నేనూ వెళ్లలేను.. ఆటను ఆస్వాదిస్తున్నాను: రిటైర్‌మెంట్‌పై స్మిత్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 10:43 AM
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ఐదో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలపై స్పందించాడు, ఆ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచులు గెలిచిన ఆసీస్.. సిరీస్ దక్కించుకుంది. బాక్సింగ్ డే టెస్టులో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో ఆసీస్‌పై గెలిచి పరువు నిలబెట్టుకుంది. కాగా ఐదో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steve Smith) తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలపై స్పందించాడు, ఆ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు.
ఆస్ట్రేలియా సీనియర్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. సిడ్నీ టెస్టు తర్వాత అతడు క్రికెట్ ఆడాడు. నాథన్ లియాన్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో స్కాట్ బోలాండ్‌తో పాటు జట్టులో అత్యంత సీనియర్ ఆటగాడిగా స్మిత్ నిలవనున్నాడు. 2027లో ఇంగ్లండ్‌లో జరిగే తదుపరి యాషెస్‌లో ఆడతారా? అన్న ప్రశ్నకు 36 ఏళ్ల స్మిత్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కానీ క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నానని చెప్పాడు.
‘రోజు రోజుకీ, సిరీస్ సిరీస్‌కీ నా నిర్ణయం ఉంటుంది. ఇప్పటికైతే నేను బాగానే ఆడుతున్నాను. జట్టుకు ఉపయోగపడుతున్నాను. ఆటను ఎంజాయ్ చేస్తున్నాను. కాబట్టి రిటైర్మెంట్ గురించి ఎలాంటి డెడ్‌లైన్ లేదు. ఉస్మాన్ లాంటి అనుభవజ్ఞుడు రిటైర్ అయినప్పుడు.. నేనూ వెంటనే వెళ్లిపోవడం సరైంది కాదు. అందుకే ఇంకా ఆడాలనుకుంటున్నాను’ అని స్మిత్ అన్నాడు.
దానిపై కూడా..
సిడ్నీ టెస్టుకు జట్టు ఎంపికపై కూడా స్మిత్ స్పష్టత ఇవ్వలేదు. ‘పిచ్‌ను చూసిన తర్వాతే జట్టును నిర్ణయిస్తాం. ఇద్దరు ఆల్‌రౌండర్లు ఆడొచ్చు, స్పిన్నర్ ఉండొచ్చు లేదా లేకపోవచ్చు. అన్ని అవకాశాలూ తెరిచే ఉన్నాయి. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ప్రతి మ్యాచ్ కీలకం. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 4-1తో ముగించాలని, ముఖ్యంగా డబ్ల్యూటీసీ పాయింట్లు సాధించాలని కోరుకుంటున్నాం’ అని స్మిత్ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
ఆఖరి నిమిషంలో తుది జట్టుకు గిల్ దూరం.. కారణం అదేనా?
ఓ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైతే జట్టులోంచే తీసేస్తారా?: యోగ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు