Washington Sundar: బాలుడి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించిన టీమిండియా ఆల్‌రౌండర్.. ఫ్యాన్స్ ఫైర్
ABN , Publish Date - Jan 03 , 2026 | 08:50 AM
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ విజయంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిని త్వరలో జరిగే న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో తాజాగా ఓ సంఘటన కారణంగా సుందర్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిని త్వరలో జరిగే న్యూజిలాండ్ సిరీస్‌తో పాటు ఫిబ్రవరిలో జరిగే టీ20 ప్రపంచ కప్ 2026కు కూడా ఎంపిక చేశారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ సంఘటనతో క్రికెట్ ఫ్యా్న్ నుంచి విమర్శలు(Washington Sundar controversy) ఎదుర్కొంటున్నాడు. సుందర్ ఓ హోటల్ నుంచి బయటికి వస్తూ ఓ కుర్రాడు ఆటోగ్రాఫ్ అడిగితే నిర్లక్ష్యంగా నిరాకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.
నెట్టింట్లో వైరల్ అయిన వీడియో ప్రకారం.. శుక్రవారం వాషింగ్టన్ సుందర్(Washington Sundar ) ఒక హోటల్ నుండి బయటకు వస్తున్నట్లు కనిపించాడు. అయితే, అతడిని చూడటానికి, సెల్ఫీ తీసుకోవడానికి పలువురు క్రికెట్ ఫ్యాన్స్ అతడి వద్దకు వచ్చారు. ఈక్రమంలో ఓ కుర్రాడు ఆటోగ్రాఫ్ ఇవ్వమని సుందర్ ను రిక్వెస్ట్ చేస్తున్నాడు. సుందర్ మాత్రం ఏం కనిపించనట్లు ప్రవర్తించాడు. అంతేకాక పలువురు సెల్ఫీ కోసం ప్రయత్నించగా.. అసలు పట్టించుకోలేదు. అంతేకాక వాషింగ్టన్ సుందర్ చికాకుపడినట్లు వీడియోలో కనిపిస్తోంది.
దీంతో చాలా మంది నెటిజన్లు వాషింగ్టన్ సుందర్(Washington Sundar)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాషింగ్టన్ సుందర్.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి వారి కంటే తనను తాను గొప్ప వ్యక్తిగా భావిస్తున్నాడా అని కొందరు నెటిజన్లు ఫైర్(social media criticism) అయ్యారు. 'ఇంత బలుపు ఎందుకు' అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. గౌతమ్ గంభీర్ స్టార్ కల్చర్‌ను దూరం పెట్టాలని చెప్పినందుకే.. సుందర్ అలా ప్రవర్తించి ఉంటాడని ఇంకొందరు ఫన్నీగా కామెంట్ పెట్టారు. ఎంత సెలబ్రిటీలు అయినా.. ప్రవర్తించే తీరు ఉంటుంది అని అంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో గతంలో కొందరు సెలబ్రిటీలు స్పందించిన తీరును గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవలి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఫార్మాట్లకతీతంగా రాణించిన సుందర్..త్వరలో న్యూజిలాండ్‌తో జరుగబోయే హోం టీ20 సిరీస్‌కు సిద్దమవుతున్నాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో బంగ్లా ప్లేయర్స్‌పై నిషేధం.. బీసీసీఐ ఏమన్నదంటే!
వీనస్ విలియమ్స్ రీ ఎంట్రీ.. 45 ఏళ్ల వయసులో!