World Cup 2026: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా.. స్టార్ ప్లేయర్లకు షాక్
ABN , Publish Date - Jan 03 , 2026 | 07:39 AM
టీ 20 ప్రపంచ కప్ 2026లో ఆడే తమ జట్టును సౌతాఫ్రికా ప్రకటించింది. ఈ క్రమంలో సెలెక్టర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ కప్ జట్టులో పలువురు స్టార్ ప్లేయర్లను ఎంపిక చేయలేదు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్-2026 ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ కప్ 2026లో ఆడనున్న దేశాలు.. తమ జట్టును ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే , ఇండియా, ఆస్ట్రేలియా వంటి పలు దేశాలు తమ ప్రపంచ కప్ జట్లను ప్రకటించాయి. తాజాగా దక్షిణాఫ్రికా కూడా తమ స్క్వాడ్(South Africa T20 World Cup squad 2026)ను ప్రకటించింది. ఈ ఎంపిక లో ప్రొటీస్ జాతీయ జట్టు సెలెక్టర్లు సంచలన నిర్ణయమే తీసుకున్నారు. ప్రపంచకప్ జట్టుకు పలువురు స్టార్ ప్లేయర్లను ఎంపిక చేయలేదు.
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో మెరుపు సెంచరీతో సత్తా చాటిన ర్యాన్ రికెల్టన్.. ఇదే లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ కెప్టెన్ అయిన స్టబ్స్, ఫాస్ట్ బౌలర్ ఓట్నీల్ బార్ట్‌మన్, విధ్వంసకర ప్లేయర్ రస్సీ వాన్ డర్ డస్సెన్‌ను ప్రపంచకప్ జట్టు ఎంపిక చేయలేదు. వీరిలో డస్సెన్‌పై వేటు పడుతుందని అందరూ ఊహించిందే. అయితే స్టబ్స్, రికెల్టన్, బార్ట్‌మన్‌పై వేటు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక టీ20 ప్రపంచ కప్ ఆడే సౌతాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా ఎయిడెన్ మార్క్రమ్(Aiden Markram)ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, జాసన్ స్మిత్ మొదటిసారి వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
పేసర్లు కగిసో రబాడ, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో జన్సెన్, స్పెషలిస్ట్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్, స్టార్ బ్యాటర్లు డికాక్, మిల్లర్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. టీ20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా గ్రూప్-డిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఆఫ్ఘనిస్తాన్, కెనడా, న్యూజిలాండ్, యూఏఈ జట్లు కూడా ఉన్నాయి. మెగా టోర్నీలో గత ఎడిషన్ రన్నరప్ అయిన ప్రొటీస్ జట్టు తమ తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 9న కెనడాతో ఆడుతుంది.
టీ20 ప్రపంచకప్-2026 దక్షిణాఫ్రికా జట్టు:
ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, మార్కో జన్సెన్, జార్జ్ లిండే, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, ఎంగిడి, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, జాసన్ స్మిత్
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్‌లో బంగ్లా ప్లేయర్స్‌పై నిషేధం.. బీసీసీఐ ఏమన్నదంటే!
వీనస్ విలియమ్స్ రీ ఎంట్రీ.. 45 ఏళ్ల వయసులో!