Share News

Virat Kohli: అర్ష్‌దీప్ సింగ్‌ను ఇమిటేట్ చేసిన విరాట్.. ఫన్నీ వీడియో వైరల్!

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:13 PM

టీమిండియా వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఏ పని చేసినా ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. విరాట్‌కు ఓ అలవాటు ఉంది.. తోటి ఆటగాళ్లను ఎప్పుడూ ఆటపట్టిస్తూ వాళ్లను ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. తాజాగా విరాట్.. టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ రన్నింగ్ స్టైల్‌ను ఇమిటేట్ చేశాడు.

Virat Kohli: అర్ష్‌దీప్ సింగ్‌ను ఇమిటేట్ చేసిన విరాట్..  ఫన్నీ వీడియో వైరల్!
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఏ పని చేసినా ఇట్టే వైరల్ అయిపోతుంటుంది. విరాట్‌కు ఓ అలవాటు ఉంది.. తోటి ఆటగాళ్లను ఎప్పుడూ ఆటపట్టిస్తూ వాళ్లను ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. మైదానంలో సరదాగా ఉంటూ అభిమానులను అలరిస్తుంటాడు. ఫేస్‌లో సీరియస్‌నెస్.. ఫీల్డ్‌లోఅగ్రెసివ్‌నెస్ మాత్రమే కాదు.. కోహ్లీలో కాస్త చిలిపితనం, సరదా మనస్తత్వమూ ఉంది. జస్‌ప్రీత్‌ బుమ్రా లాంటి బౌలర్ల బౌలింగ్‌ యాక్షన్‌ను, దక్షిణాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా వాకింగ్‌ స్టైల్‌ను, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, హర్భజన్‌ సింగ్‌... ఇలా కోహ్లీ(Virat Kohli) వీలు చిక్కినప్పుడల్లా ఎదుటి క్రికెటర్లను సరదాగా అనుకరిస్తూ.. ఆట పట్టిస్తుంటాడు.


తాజాగా విరాట్.. టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్(Arshdeep Singh) రన్నింగ్ స్టైల్‌ను ఇమిటేట్ చేశాడు. జనవరి 11 నుంచి వడోదర వేదికగా టీమిండియా-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో రన్నింగ్ చేస్తూ.. విరాట్ కోహ్లీ, అర్ష్‌దీప్ సింగ్ ఒకరికొకరు ఎదురవుతారు. అప్పుడు కోహ్లీ.. అర్ష్‌దీప్ సింగ్ స్టైల్‌ను ఇమిటేట్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

తిలక్ వర్మ స్థానంలో అతడే సరైన ఎంపిక: ఆకాశ్ చోప్రా

మలేసియా ఓపెన్.. టోర్నీ నుంచి సింధు ఔట్

Updated Date - Jan 10 , 2026 | 12:13 PM