Share News

PV Sindhu: మలేసియా ఓపెన్.. టోర్నీ నుంచి సింధు ఔట్

ABN , Publish Date - Jan 10 , 2026 | 09:30 AM

మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు నిష్ర్కమించింది. శనివారం జరిగిన సెమీస్‌లో సింధు పరాజయం పాలైంది. సెమీ ఫైనల్ మ్యాచులో చైనాకు చెందిన రెండో సీడ్ వాంగ్ జి యి చేతిలో సింధు 16-21, 15-21 వరుస గేమ్‌లు కోల్పోయి ఓటమి పాలైంది.

PV Sindhu: మలేసియా ఓపెన్.. టోర్నీ నుంచి సింధు ఔట్
PV Sindhu

ఇంటర్నెట్ డెస్క్: మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు నిష్ర్కమించింది. శనివారం జరిగిన సెమీస్‌లో సింధు(PV Sindhu) పరాజయం పాలైంది. సెమీ ఫైనల్ మ్యాచులో చైనాకు చెందిన రెండో సీడ్ వాంగ్ జి యి చేతిలో సింధు 16-21, 15-21 వరుస గేమ్‌లు కోల్పోయి ఓటమి పాలైంది. ఈ టోర్నీలో ఇప్పటికే పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ కూడా క్వార్టర్స్ దశలోనే ఓడిన సంగతి తెలిసిందే.


గాయం బారిన పడిన సుదీర్ఘ కాలం తర్వాత పీవీ సింధు ఈ టోర్నీలో పోటీ పడింది. ఆది నుంచి అజేయంగా నిలిచి ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచులో డేంజరేస్ ప్లేయర్ జపాన్‌కు చెందిన అకానె యమగుచిని ఓడించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. అనూహ్యంగా సెమీస్‌లో ఓడి ఈ టోర్నీ నిష్ర్కమించింది.


ఇవి కూడా చదవండి:

ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం.. హర్మన్‌ప్రీత్ కౌర్

తమీమ్ ఇక్బాల్ ‘ఇండియన్ ఏజెంట్’.. బీసీబీ సభ్యుడి సంచలన ఆరోపణలు

Updated Date - Jan 10 , 2026 | 09:30 AM