WPL 2026: ఈ గెలుపు ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది: స్మృతి మంధాన
ABN , Publish Date - Jan 10 , 2026 | 07:54 AM
డబ్ల్యూపీఎల్ 2026 శుక్రవారం ఘనంగా మొదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఆర్సీబీకి ఓటమి తప్పదనుకున్న స్థితిలోనాడిన్ డి క్లెర్క్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆ జట్టుకు విజయాన్నందించింది. తమ విజయంపై కెప్టెన్ స్మృతి మంధాన మ్యాచ్ అనంతరం మాట్లాడింది.
ఇంటర్నెట్ డెస్క్: డబ్ల్యూపీఎల్ 2026 శుక్రవారం ఘనంగా మొదలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో నాడిన్ డి క్లెర్క్ ఆల్‌రౌండర్ ప్రదర్శన ఆకట్టుకుంది. ఆఖరి ఓవరిలో 18 పరుగులను ఎంఐ(MI) డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఆర్సీబీకి ఓటమి తప్పదనుకున్న స్థితిలోనాడిన్ డి క్లెర్క్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆ జట్టుకు విజయాన్నందించింది. ఆమె బ్యాటింగ్‌కు వచ్చిన ఓవర్ పూర్తయ్యేసరికి ఆర్సీబీ స్కోరు 65/5. గ్రేస్ హారిస్ (25), స్మృతి మంధాన (18) జట్టుకు మెరుపు ఆరంభాన్నే ఇచ్చినప్పటికీ.. 25 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో క్లెర్క్ నిలబడి పోరాడింది. చివరి నాలుగు బంతులకు భారీ షాట్లు ఆడి ఆర్సీబీకి అనూహ్య విజయాన్నందించింది. తమ విజయంపై కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana) మ్యాచ్ అనంతరం మాట్లాడింది.
‘తొలి మ్యాచే అద్భుతమైన థ్రిల్లర్‌ను తలపించింది. ఆర్సీబీ అంటేనే థ్రిల్లర్లకు పెట్టింది పేరు అసాధారణ ప్రదర్శనతో నాడిన్ డి క్లెర్క్(Nadine de Klerk) జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించింది. పరిస్థితులు మాకు అనుకూలంగా లేనప్పుడు కూడా జట్టులోని ప్లేయర్లంతా చాలా సానుకూలంగా ఉన్నారు. పరిస్థితులన్నీ తమ చేతిలోకి తెచ్చుకుని మరీ పోరాడారు. ప్రతి ఒక్కరూ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు’ అని తెలిపింది.
బాధ్యత తీసుకుంది..
‘డి క్లెర్క్ బ్యాటింగ్, బౌలింగ్‌లో పూర్తి బాధ్యత తీసుకుంది. విశాఖపట్నంలో ఆమె మాకు ప్రత్యర్థిగా ఆడినప్పుడు కూడా ఇలాంటి ప్రదర్శనే చేసింది. తాజా మ్యాచ్ కూడా నాటి పరిస్థితులను తలపించింది. ఆ మ్యాచ్‌ను గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా డి క్లెర్క్ చెలరేగుతుందని మా కోచ్ రంగరాజన్ చెబుతూనే ఉన్నారు. డి క్లెర్క్ క్యాచ్ డ్రాప్ అయినప్పుడు ముంబై ప్లేయర్ సజనలాగే ఆమె కూడా పరుగులు చేయాలని మేం కోరుకున్నాం. అనుకున్నట్టే క్లెర్క్ చెలరేగిది’ అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి:
ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం.. హర్మన్‌ప్రీత్ కౌర్
తమీమ్ ఇక్బాల్ ‘ఇండియన్ ఏజెంట్’.. బీసీబీ సభ్యుడి సంచలన ఆరోపణలు