Home » Smriti Mandhana
విశాఖ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 129 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగిన భారత్.. 11.5 ఓవర్లలోనే ఆటను ముగించింది.
టీమిండియా మహిళా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ.. ఐసీసీ మహిళల టీ20 అంతర్జాతీయ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. బ్యాటర్లలో సౌతాఫ్రికా కెప్టె్న్ లారా వోల్వార్ట్.. మరోసారి తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ట్రోఫీని టీమిండియా సగర్వంగా ముద్దాడింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఈ ఏడాది తెర పడింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ.. వంటి ప్లేయర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ట్రోఫీని అందించారు. ఆ మరుపురాని క్షణాలు మరోసారి నెమరువేసుకుందాం..
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి పెళ్లి రద్దు అయిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వేరే యువతితో చేసిన చాటింగ్ వైరల్ అయ్యాయి. పెళ్లి రద్దుకు సోషల్ మీడియానే కారణమంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
పెళ్లి రద్దు తరువాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన భారత్ స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి టీమిండియా జెర్సీ ధరిస్తే మనసులో ఇతర ఆలోచనలన్నీ తొలగిపోయి ఆటపై చెదరని ఏకాగ్రత కుదురుతుందని అన్నారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దు అయింది. ఈ మేరకు ఆమె ఆదివారం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని అందరినీ రిక్వెస్ట్ చేసింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన- సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ పెళ్లి అనూహ్యంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలిసారిగా ఇన్‌స్టా పోస్ట్ పెట్టింది. ఆ వీడియోలో ఆమె వేలికి ఉంగరం లేకపోవడం చర్చకు దారి తీసింది.
స్మృతి మందానా పెళ్లి వాయిదా పడిన వారాల తర్వాత పలాశ్ ముచ్చల్ బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమమైన 'శ్రీ హిట్ రాధా కేలి కుంజ్' ఆయనను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డిసెంబర్ 7న స్మృతి మంధాన పెళ్లి జరుగుతుందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆమె సోదరుడు శ్రావణ్ స్పష్టం చేశాడు. పెళ్లి ఇంకా వాయిదాలోనే ఉందని చెబుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టాడు.
స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. వీరి పెళ్లి పూర్తిగా రద్దు అయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ వార్తలన్నింటికీ ‘దిష్టి’ ఎమోజీతో వారిద్దరూ చెక్ పెట్టారు.