Smriti Mandhana: కెమెరామెన్‌పై స్మృతి మంధాన అసహనం.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 10 , 2026 | 03:01 PM
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన కెమెరామెన్‌పై అసహనం వ్యక్తం చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ భాగంగా తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: భారత మహిళా జట్టు స్టార్ ప్లేయర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఆటతో పాటు అందానికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా మంది ఆమెను లేడీ కోహ్లీ అని పిలుస్తుంటారు. విరాట్ కోహ్లీ మాదిరే స్మృతి పట్లా ఆర్సీబీ ఫ్యాన్స్ వీరాభిమానం చూపిస్తారు. ఆమెకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. అందుకే కెమెరామెన్ సైతం మైదానం లోపలా, వెలుపలా ఆమెపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటాడు. తాజాగా కెమెరామెన్‌పై స్మృతి అసహనం వ్యక్తం చేసింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2026) శుక్రవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు మైదానంలో బ్యాట్‌తో స్మృతి మంధాన ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ కెమెరామెన్ ఆమెకు దగ్గరగా వచ్చి ఫొటోలు తీసే ప్రయత్నం చేశాడు. దీంతో మంధాన కాస్త చిరాకుపడింది. ‘ఇక్కడ కూడా వదలరా? ’ అన్నట్లుగా రియాక్షన్(Smriti Mandhana cameraman reaction) ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ప్రస్తుతం.. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. కాగా.. ఇటీవల పెళ్లి విషయంలో స్మృతికి చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. తన ప్రియుడు పలాష్ ముచ్చల్‌తో జరగాల్సిన పెళ్లి హఠాత్తుగా ఆగిపోయింది. ఇక డబ్ల్యూపీఎల్ 2026 విషయానికి వస్తే.. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో విజయంతో ఆర్సీబీ సీజన్‌ను ఆరంభించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో(RCB vs MI) జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇవి కూడా చదవండి:
జెమీమాతో కలిసి పాడి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గావస్కర్!
అర్ష్‌దీప్ సింగ్‌ను ఇమిటేట్ చేసిన విరాట్.. ఫన్నీ వీడియో వైరల్!