Home » RCB
14 ఏళ్ల ఐపీఎల్ ప్రయాణానికి ఫాఫ్ డుప్లెసిస్ వీడ్కోలు ప్రకటించాడు. ఐపీఎల్ 2026 వేలానికి ముందు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. ఈ ఏడాది పీఎస్ఎల్‌లో ఆడనున్నట్టు తెలిపాడు.
ఐపీఎల్ 2026 సందడి ఇప్పటికే మొదలైంది. ఈసారి ఫ్రాంచైజీలు చేతులు మారనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్సీబీని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్ఆర్‌ను కూడా అమ్మకానికి పెట్టినట్టు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గొయెంకా పోస్ట్‌లో పేర్కొన్నారు.
గతేడాది ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హోం గ్రౌండ్‌ను చిన్నస్వామి స్టేడియం నుంచి మహారాష్ట్రకు మారుస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026కి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫ్రాంచైజీని విక్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 2026 మార్చి కల్లా ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు డియాజియో పీఎల్‌సీకి చెందిన భారత అనుబంధ సంస్థ యూనైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యూఎస్ఎల్) బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్ఈ)కి లేఖ రాసింది.
కన్నడ రాజ్యోత్సవం(RCB Kannada Rajyotsava) పురస్కరించుకొని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆర్సీబీ స్టార్ ప్లేయరందరూ ఒక్కొక్కరిగా వచ్చి కన్నడ రాజ్యోత్సవ విషెష్ చెప్పారు. కానీ..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన కమర్షియల్ కాంట్రాక్ట్‌పై కోహ్లీ సంతకం చేయలేదనే ప్రచారం సాగుతోంది.
ఐపీఎల్లో అభిమానులను ఉర్రూతలూగించే జట్టుగా గుర్తింపు పొందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఓనర్ మారనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ మద్యం సంస్థ డియాజియో, RCB యాజమాన్యంలో తన వాటాను విక్రయించేందుకు ప్రాథమిక ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఐపీఎల్ టైటిల్ గెల్చుకున్న తర్వాత ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియం వద్ద 'విక్టరీ సెలబ్రేషన్స్' ఏర్పాటు చేయగా తొక్కిసలాటకు దారితీసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర వివరణ ఇచ్చారు. ఈ విషాదానికి నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆర్‌సీబీ పేసర్ యశ్ దయాళ్‌పై మరో అత్యాచారం కేసు నమోదైంది.
RCB Stampede: ఆ రిపోర్టను కర్ణాటక హైకోర్టుకు ఇచ్చింది. చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారణం ఆర్సీబీనేనని స్పష్టం చేసింది. పోలీసుల నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా.. పోలీసులను సంప్రదించకుండా ఆర్సీబీ విక్టరీ పెరేడ్ చేయడానికి పూనుకుందని పేర్కొంది.