డబ్ల్యూపీఎల్- 2026 ఫైనల్: టాస్ గెలిచిన బెంగళూరు
ABN , Publish Date - Feb 05 , 2026 | 06:26 PM
మహిళల ప్రీమియర్ లీగ్-2026లో భాగంగా ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
స్పోర్ట్స్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్-2026 ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. సీజన్-4 ట్రోఫీ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిపోరులో తలపడుతున్నాయి. వడోదర వేదికగా ఈ పతాక పోరు జరగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో జెమీమా జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
డబ్ల్యూపీఎల్ లో బెంగళూరు-ఢిల్లీ ఇప్పటిదాకా తొమ్మిదిసార్లు తలపడగా.. ఆరుసార్లు ఢిల్లీ విజేతగా నిలిచింది. అయితే 2024 ఫైనల్లో మాత్రం ఢిల్లీపై ఆర్సీబీనే పైచేయి సాధించింది. డబ్ల్యూపీఎల్-4లో రెండుసార్లు ఢీకొన్న ఢిల్లీ, బెంగళూరు.. చెరో మ్యాచ్ నెగ్గాయి.
తుది జట్లు:
బెంగళూరు జట్టు:
గ్రేస్ హారిస్, స్మృతి మంధాన (కెప్టెన్), జార్జియా వోల్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), రాధా యాదవ్, నాడిన్ డి క్లర్క్, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, సయాలీ సత్ఘరే, శ్రేయాంక పాటిల్, లారెన్ బెల్
ఢిల్లీ:
లిజెల్ లీ (వికెట్ కీపర్), షఫాలీ వర్మ, లారా వోల్వార్డ్ట్, జెమిమా రోడ్రిగ్స్ (కెప్టెన్), మారిజాన్ కాప్, చినెల్లే హెన్రీ, నికి ప్రసాద్, స్నేహ రానా, మిన్ను మణి, శ్రీ చరణి, నందనీ శర్మ
ఇవి కూడా చదవండి:
టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడేది లేదు.. స్పష్టం చేసిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి..
అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ