ఐసీసీ ఛైర్మన్ జైషాపై ఫిఫా అధ్యక్షుడు జియా ప్రశంసలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 03:47 PM
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ జైషాను ఫిపా అధ్యక్షుడు జియా ఇన్ఫాంటినో ప్రశంసించారు. క్రికెట్ అభివృద్ధికి జైషా అద్భుతమైన కృషి చేస్తున్నారని కొనియాడారు. జైషాతో ఉన్న ఫొటోను తాజాగా ఇన్ఫాంటినో తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశారు.
స్పోర్ట్స్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ఛైర్మన్ జైషాను ఫిపా అధ్యక్షుడు జియా ఇన్ఫాంటినో ప్రశంసించారు. క్రికెట్ అభివృద్ధికి జైషా అద్భుతమైన కృషి చేస్తున్నారని కొనియాడారు. జైషాతో ఉన్న ఫొటోను తాజాగా ఇన్ఫాంటినో తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశారు. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో(Olympics) క్రికెట్‌ను చేరుస్తున్న నేపథ్యంలో జైషాకు శుభాకాంక్షలు తెలిపారు.
‘ఐసీసీ ఛైర్మన్ జైషాను కలవడం నాకు సంతోషంగా ఉంది. క్రికెట్‌ను అందరినీ ఆకట్టుకునేలా అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన అద్భుతమైన కృషి ఆదర్శప్రాయం. ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ తిరిగి చేరుతున్నందుకు జైషాకు, అలానే అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రీడలతో ప్రపంచాన్ని ఏకం చేస్తున్నప్పుడు పరస్పర సహకారాల కోసం జైషాతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్న’ అని ఇన్ఫాంటినో ఇన్ స్టా వేదికగా పేర్కొన్నారు.
గతంలో చివరిసారిగా పారిస్ ఒలింపిక్స్ 1900లో క్రికెట్‌ను నిర్వహించారు. ఆ సమయంలో ఫ్రాన్స్‌తో జరిగిన ఒకే ఒక్క మ్యాచ్‌లో బ్రిటన్ గెలిచి బంగారు పతకాన్ని గెలుచుకుంది. మళ్లీ 128 ఏళ్ల తర్వాత 2028లో రెండోసారి క్రికెట్.. ఒలింపిక్స్‌లో భాగం కానుంది. 2028 ఒలింపిక్స్‌లో జరిగే అన్ని క్రికెట్ మ్యాచ్‌లు లాస్ ఏంజిల్స్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోమోనాలోని ఫెయిర్‌గ్రౌండ్స్‌లో తాత్కాలికంగా నిర్మించిన వేదికలో జరుగుతాయి. అయితే.. ఈ ఒలింపిక్ క్రీడలకు క్రికెట్‌ను చేర్చే విషయం ఇంకా ఖరారు కాలేదు. జులైలో సింగపూర్‌లో నిర్వహించనున్న వార్షిక సమావేశంలో ఈ విషయమై చర్చించే అవకాశముందని సమాచారం.
ఇవి కూడా చదవండి:
టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడేది లేదు.. స్పష్టం చేసిన పాకిస్థాన్ ప్రధాన మంత్రి..
అసామాన్య ప్రతిభకు నిలువెత్తు రూపం.. లిజెలీ లీ