Home » ICC
ఆసియా కప్‌లో 12 వికెట్లతో అదరగొట్టిన భారత యువ స్పిన్నర్ శ్రీచరణి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. 800 రేటింగ్ పాయింట్ల మార్క్‌ను అందుకున్న తొలి భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది.
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్థాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆ జట్టుపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది.
పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాకిచ్చింది. మహిళల ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాతిమా ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆమెపై చర్యలు తీసుకుంది.
మొట్టమొదటి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఇవాళ ప్రకటించింది.
శ్రీలంక క్రికెట్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 2027లో తొలిసారి జరగనున్న మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను శ్రీలంక కోల్పోయింది. ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరగాల్సిన ఈ టోర్నీ ఇక శ్రీలంకలో జరగదు.
టీమిండియా యువ క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ వ్యవహార శైలిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రంగా స్పందించాడు. మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో అనుచితంగా ప్రవర్తించే యువ ఆటగాళ్లపై ఐసీసీ, బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించాడు.
టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆధిపత్యానికి తెరపడింది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తొలిసారిగా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్యపై ఐసీసీ చర్యలు తీసుకుంది. లెవల్ 1 కోడ్ ఉల్లంఘనకు పాల్పడినందుకు మందలించడం సహా ఒక డీమెరిట్ పాయింట్‌ను విధించింది.
భారత బ్యాటర్ యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో మధ్య మైదానంలో చోటు చేసుకున్న వాగ్వాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది.
ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఘోర ఓటమి ఎదురైనా.. బంగ్లాదేశ్‌కు మాత్రం అరుదైన గౌరవం దక్కింది. తాజాగా విడుదలైన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ మూడు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది.