Share News

వాళ్లు చెప్పిందే మేం వినాలి.. భారత్‌తో మ్యాచ్ ఆడటంపై పాకిస్థాన్ కెప్టెన్ వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:32 AM

టీ20 ప్రపంచ కప్ 2026 సమీపిస్తోన్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో పాల్గొంటాం కానీ భారత్‌తో మ్యాచ్ ఆడబోమని తేల్చి చెప్పింది. ఈ అంశంపై పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు.

వాళ్లు చెప్పిందే మేం వినాలి.. భారత్‌తో మ్యాచ్ ఆడటంపై పాకిస్థాన్ కెప్టెన్ వ్యాఖ్యలు
Salman Ali Agha

ఇంటర్నెట్ డెస్క్: ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. దీనికి ముందు పాకిస్థాన్ జట్టు ఈ టోర్నీలో పాల్గొంటాం కానీ భారత్‌తో మ్యాచ్ ఆడబోమని తేల్చి చెప్పింది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించడంతో ఆ దేశానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఫిబ్రవరి 15న శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్-పాక్ తలపడాల్సి ఉంది. పాక్ ప్రభుత్వం నిర్ణయాన్ని అనుసరిస్తూ పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అంశంపై పాకిస్థాన్ టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘా(Salman Ali Agha) స్పందించాడు.


‘మేం ఐసీసీ టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) ఆడబోతున్నాం. కానీ భారత్‌తో మాత్రం ఆడట్లేము. అయితే ఇది మా నిర్ణయం కాదు. ఈ విషయంలో ఆటగాళ్లు ఏమీ చేయలేరు. పాక్ ప్రభుత్వం, పీసీబీ ఛైర్మన్ ఏం చెబితే అదే మేం పాటించాల్సి ఉంటుంది’ అని సల్మాన్ అలీ అఘా పేర్కొన్నాడు.


ఐసీసీ హెచ్చరిక

పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఐసీసీ(ICC) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం గ్లోబల్ క్రికెట్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ‘ఇలాంటి చర్యలు పాకిస్థాన్ క్రికెట్‌కే దీర్ఘకాలిక నష్టాన్ని కలిగించవచ్చు. ఇది ప్రపంచ క్రికెట్‌కు, అభిమానులకు అనుకూలమైన నిర్ణయం కాదు. అవసరం అయితే శిక్షాత్మక చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.


ఇవీ చదవండి:

డబ్ల్యూపీఎల్ 2026: ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్న యూపీ వారియర్స్

పాకిస్థాన్ ఎప్పుడూ ఒక్క మాట మీద నిలబడదు: సునీల్ గావస్కర్

Updated Date - Feb 02 , 2026 | 11:32 AM