Share News

డబ్ల్యూపీఎల్ 2026: ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్న యూపీ వారియర్స్

ABN , Publish Date - Feb 02 , 2026 | 10:56 AM

మహిళల ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో యూపీ వారియర్స్‌కు నిరాశే మిగిలింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ సందర్భంగా యూపీ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

డబ్ల్యూపీఎల్ 2026: ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్న యూపీ వారియర్స్
UP Warriors

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో యూపీ వారియర్స్‌కు నిరాశే మిగిలింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజన్‌(WPL 2026)లో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన యూపీ.. ఆరింట్లో పరాజయాన్ని చవి చూసింది. ఈ ఓటమితో యూపీ వారియర్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.


ఈ పరాజయంతో యూపీ వారియర్స్(UP Warriors) ఒక అనవసర రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఓటములు ఎదుర్కొన్న జట్టుగా యూపీ నిలిచింది. ఇప్పటివరకు 33 మ్యాచ్‌లు ఆడిన యూపీ వారియర్స్.. 21 సార్లు ఓడిపోయింది. గుజరాత్ జెయింట్స్ 33 మ్యాచ్‌ల్లో 20 ఓటములతో రెండో స్థానంలో ఉంది. వరుసగా మరో సీజన్‌లోనూ నాకౌట్ దశకు చేరలేకపోవడం యూపీకి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. వచ్చే సీజన్‌లో అయిన గణనీయమైన మార్పులు అవసరమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఓటమిపై మెగ్ లానింగ్ స్పందనమిదే..

మ్యాచ్ అనంతరం యూపీ వారియర్స్ కెప్టెన్ మెగ్ లానింగ్(Meg Lanning) జట్టు ప్రదర్శనపై స్పందించింది. ‘చివరి వరకు బాగా పోరాడాం. గెలిచేందుకు కొన్ని అవకాశాలు కూడా సృష్టించుకున్నాం. కానీ బ్యాటింగ్‌లో మాత్రం జట్టుకు శుభారంభాన్ని అందించలేకపోయాం. నిలకడగా ఆడలేకపోవడమే ఈ సీజన్‌లో మాకు ప్రధాన సమస్య. ఇది మేం ఆశించిన సీజన్ కాదు. ఈ సీజన్‌ను ఓటమితో ముగియడం బాధగా ఉంది. గిరి అద్భుతంగా రాణించింది. స్టంప్స్ వెనుక ఆమె ప్రదర్శన ప్రశంసనీయం. ఇది ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను. మూడు ఓవర్ల స్పెల్స్ చూడటం అరుదైన విషయం. అయినా నేను ఇంకా క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాను. మా ప్లేయర్ల నుంచి ఉత్తమ ప్రతిభను వెలికితీయడానికి ప్రయత్నిస్తున్నాను’ అని లానింగ్ తెలిపింది.


ఇవీ చదవండి:

ప్రపంచకప్‌లో పాల్గొంటాం.. భారత్‌తో ఆడం

భారత్‌కు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేసిన తిలక్ వర్మ

Updated Date - Feb 02 , 2026 | 10:56 AM